Ukraine War : రష్యాకు ఈజిప్ట్ సహాయం : అమెరికా

Ukraine War : రష్యాకు ఈజిప్ట్ సహాయం : అమెరికా
X

ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా నిఘా సంస్థలు లీక్ చేయడం పాశ్చాత్య దేశాల్లో కలకలం రేపుతోంది. ఉక్రెయిన్‌పై ఏడాది కాలంగా చేస్తోన్న రష్యాకు ఈజిప్టు సహాయం చేసేందుకు సిద్ధమైందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగా ఈజిప్టు 40వేల రాకెట్లను తయారు చేసి రష్యాకు రహస్యంగా తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని అమెరికా వార్తా సంస్థ ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం వెల్లడించింది. ఇందుకోసమే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి తన సైనికాధికారులతో ఇటీవల రహస్యంగా భేటీ అయినట్లు ఈ కథనం వెల్లడించింది. రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అందించడంపైనా చర్చించినట్లు సమాచారం.

పాశ్చాత్య దేశాల నుంచి ఇబ్బంది రాకుండా ఈ ప్రణాళికనంతా రహస్యంగా ఉంచాలని అధికారులకు సూచించినట్లు తాజా కథనం పేర్కొంది. ఈ విషయాలు తెలుసుకున్న అమెరికా అధికారులు నిర్ఘాంతపోయినట్లు తెలిసింది.అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా ఈజిప్టు కొనసాగుతోంది. గతేడాది నవంబర్‌లో ఈజిప్టులో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఎల్‌-సిసితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధంలో ఈజిప్టు నిర్ణయాన్ని బైడెన్‌ ప్రశంసించారు. ఈ తరుణంలో ఒకవేళ రష్యాకు ఈజిప్టు అధ్యక్షుడు రహస్యంగా ఆయుధ సంపత్తిని సమకూర్చాలని భావిస్తే మాత్రం అవి ఇరు దేశాల సంబంధాలను తీవ్ర ప్రభావితం చేసే అవకాశలున్నట్లు తెలుస్తోంది.

Next Story