Ukraine War : రష్యాకు 18 డ్రోన్లను సరఫరా చేసిన ఇరాన్

Ukraine War : రష్యాకు 18 డ్రోన్లను సరఫరా చేసిన ఇరాన్
ఉక్రెయిన్ పై యుద్దంలో ఉపయోగించేందుకు కొత్త రకాల అధునాతన దీర్ఘ - శ్రేణి సాయుధ డ్రోన్ లను రష్యా కొనుగోలు చేసింది

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్దం కొంతపుంతలు తొక్కుతుంది. యుద్దంలో సాంకేతికతను జోడిస్తుంది రష్యా. అందులో భాగంగా ఇరాన్ నుంచి 18 డ్రోన్లను కొనుగోలు చేసింది. ఉక్రెయిన్ పై యుద్దంలో ఉపయోగించేందుకు కొత్త రకాల అధునాతన దీర్ఘ - శ్రేణి సాయుద డ్రోన్ లను రష్యా కొనుగోలు చేసింది. అక్రమ రవాణా ద్వారా ఇరాన్ నుంచి రష్యాకు డ్రోన్లను చేరవేశారు. రష్యా అధికారులు నవంబర్ లో టెహ్రాన్ లో పర్యటించిన తర్వాత, 18 డ్రోన్ లను రష్యా నావికాదళానికి అందాయి.

10 మంది వ్యక్తులతో కూడిన రష్యా ప్రతినిధి బృందం 12షాహెద్, 191, 129 డ్రోన్ లను ఎంచుకుంది. ఇవి ఆకాశం నుంచి భూమిపై దాడులు చేయగలవు. ఆరు మొహజెర్ -6 డ్రోన్ లతో పాటు, సుమారు 200కిమీల పరిధిని కవర్ చేస్తాయని, రెండు క్షిపణులను మోసుకెళ్తాయని తెలుస్తోంది. సముద్ర మార్గం గుండా డ్రోన్లను రష్యాకు చెందిన నేవీకి డెలివరీ చేసినట్లు సమాచారం. అక్కడినుంచి రష్యాకు తరలించారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ - రష్యా మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story