Ukraine war: గర్జించిన ఉక్రెయిన్.. రష్యాపై రాకెట్ స్ట్రైక్
Russia

ఉక్రెయిన్ ప్రతీకార చర్యకు మాస్కో మిసైళ్లవర్షంతో మోతెక్కిపోయింది. డోనే ప్రాంతంపై రాకెట్ లను ఎక్కుపెట్టిన ఉక్రెయిన్ అక్కడున్న 63మంది సైనికులను హతమార్చింది. పదినెలలగా కొనసాగుతున్న యుద్ధంలో కమ్యునిస్ట్ దేశంపై జరిగిన అతి పెద్ద అటాక్ ఇదేనని చెప్పాలి.
అమెరికా సహకారంతో పొందిన సరికొత్త ఆయుధాన్ని ప్రయోగించిన ఉక్రెయిన్ రష్యాలోని కీలకమైన స్థావరాలపై దాడులకు తెగబడుతోంది. ఈ దాడిలో మకివ్కా ప్రాంతంలో ఎంతో మంది స్థానికులు సైతం ప్రాణాలు కోల్పోయారని రష్యా గవర్నర్ వెల్లడించారు.
ఉక్రెయిన్ దాదాపూ 6 రాకెట్లను ప్రయోగించగా అందులో రెండింటిని కూల్చివేసినట్లు రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ లోని కెయివ్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సుమారు 40 డ్రోన్లను ప్రయోగించగా అందులో కొన్నింటిని ఉక్రెయిన్ సేనలు నేలకూల్చాయి. అయితే ఈ దాడులతో దేశంలోని ప్రధాన శక్తి వనరలు నేలమట్టం అవుతున్నాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com