Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. రక్తపు టేరులు ఆగే అవకాశం

Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. రక్తపు టేరులు ఆగే అవకాశం
Ukraine Russia War: ప్రపంచాన్ని కలవర పాటుకు గురిచేసిన ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ఇక ముగింపు పలుకనుంది.

Ukraine-Russia War: ప్రపంచాన్ని కలవర పాటుకు గురిచేసిన ఉక్రెయిన్ పై రష్యా దాడులకు ఇక ముగింపు పలుకనుంది. ఈ యుద్దంలో వేలాదిమంది అమాయక ప్రజలు బలయ్యారు. ఇరుదేశాల పోటాపోటీ దాడుల్లో వందలాదిమంది అవిటివాళ్లుగా మిగిలిపోయారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ఎంతోమంది దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే గత తొమ్మిది నెలలుగా సాగుతున్న ఈ ఉక్రెయన్ పై దాడికి ముగింపు పలికే ఛాన్స్ కనిపిస్తోంది. రక్తపు టేరులు ఆగే అవకాశం ఉంది.


రష్యా సైనికుల నుంచి విముక్తి పొందిన ఖేర్సన్‌ నగరంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ దళాల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధం ముగింపునకు ఇదే ఆరంభమని భావిస్తున్నట్లు తెలిపారు. అందుకు జెలెన్‌ స్కీ వ్యాఖ్యలే ఉదాహరణగా భావిస్తున్నారు. ఉత్తర కీవ్‌తో, ఈశాన్య ఖర్కీవ్‌, ఖేర్సన్‌ ప్రాంతాలు ఇప్పుడు తిరిగి కీవ్‌ సేనల అధీనంలోకి వచ్చాయి. ఖేర్సన్ నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా ఇటీవల ప్రకటించింది.


ఖేర్సన్ నగరంలో పర్యటించిన జెలెన్‌స్కీ...ఉక్రెయిన్‌ సేనలను ప్రశంసించారు. రష్యా దాడుల్లో ఖేర్సన్‌లో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో క్లిష్ట సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన బలమైన సైన్యం ఈ ప్రాంతానికి శత్రువుల నుంచి తిరిగి దక్కించుకోగలిగింది' అని అన్నారు. క్రెమ్లిన్‌ దళాల నుంచి ఉక్రెయిన్‌ ఆర్మీ ఇప్పటివరకు మూడు అతిపెద్ద ప్రాంతాలను తిరిగి దక్కించుకోగలిగింది. ఉత్తర కీవ్‌తో, ఈశాన్య ఖర్కీవ్‌, ఖేర్సన్‌ ప్రాంతాలు ఇప్పుడు తిరిగి కీవ్‌ సేనల అధీనంలోకి వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story