RUSSIA-UKRAINE: రష్యా భీకర దాడులు... పంతం నెగ్గించుకున్న ఉక్రెయిన్‌

RUSSIA-UKRAINE: రష్యా భీకర దాడులు... పంతం నెగ్గించుకున్న ఉక్రెయిన్‌
నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ నౌకలను అడ్డుకుంటున్న రష్యా.... హెచ్చరికలను బేఖాతరు చేస్తూ బయలుదేరిన నౌక

ఉక్రెయిన్‌(ukraine)పై రష్యా(russia) మళ్లీ భీకర దాడులు(attacks) చేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన సరకు రవాణా నౌకల(cruise ships)ను అడ్డుకోమని గత వేసవిలో చేసుకున్న ఒప్పందం నుంచి వైదొలిగిన రష్యా... ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్‌కు చెందిన ధాన్యం ఓడలు, నిల్వ కేంద్రాలపై డ్రోన్‌(drone attacks)లతో విరుచుకుపడుతోంది. నల్ల సముద్రం నుంచి వెళ్తున్న ఉక్రెయిన్ నౌకల(ukraine ships)కు అడ్డుపడుతోంది. అందులో మారణాయుధాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే వాటిని వదిలేస్తోంది.

ఉక్రెయిన్‌ డనూబే నదిపై ఉన్న రెండు ఓడరేవులపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ చోట పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఘటన జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి.అధిక మొత్తంలో ధాన్యం నిల్వ ఉంచే కేంద్రాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిని ఉక్రెయిన్ తిప్పికొట్టింది. డ్రోన్లపై బుల్లెట్ల వర్షం కురిపించింది. రష్యాకు చెందిన 13 డ్రోన్లను కూల్చివేసినట్లు ఒడెశా గవర్నర్ ఓలే కీపర్ ప్రకటించారు.


డానుబే నదిపై ఉన్న ఉక్రెయిన్ ఓడరేవులు ఐరోపాకు తృణధాన్యాలు ఎగుమతి చేసే ప్రధాన ప్రాంతాలు. ఇక్కడి నుంచి ధాన్యాన్ని నల్ల సముద్రం ద్వారా పలు ఓడరేవులకు ఉక్రెయిన్ తరలిస్తుండగా రష్యా వాటికి అడ్డుపడుతోంది.ఉక్రెయిన్‌ నౌకాశ్రయాలపై నిరంతరం దాడులు చేస్తున్న రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఒడెసా నౌకాశ్రయం నుంచి 30 వేల టన్నుల సరకుతో ఓ నౌక బయల్దేరింది. ఇందులో ఆహార ఉత్పత్తులూ ఉన్నాయి. తమ సహకారం లేకుండా నల్లసముద్రం గుండా రవాణా సాగనీయబోమని రష్యా ఇటీవల హెచ్చరికలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఒడెసాను లక్ష్యంగా చేసుకుంటూ డ్రోన్లు, క్షిపణులు ప్రయోగిస్తూ వచ్చింది. అయితే ఆ హెచ్చరికలను తాము పట్టించుకోబోమని ఉక్రెయిన్‌ చెబుతూ వస్తోంది. అంతర్జాతీయ సహకారం లభిస్తే తాము ఎగుమతులు చేయడానికి సిద్ధమని ప్రకటించింది. చివరకు తన పంతం నెగ్గించుకుంది. ఒడెసా నౌకాశ్రయం నుంచి నౌక బయల్దేరినట్లు అమెరికా కూడా ధ్రువీకరించింది. మరోవైపు డాన్యూబ్‌ నది తీరంలోని నౌకాశ్రయాలపై, గోదాములపై బుధవారం రష్యా.. డ్రోన్లతో దాడి చేసినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది.


కొంతకాలంగా రష్యాపై ప్రతిదాడులకు దిగుతోన్న ఉక్రెయిన్‌.. పాశ్చాత్య దేశాలు అందించిన డ్రోన్లను వినియోగిస్తోంది. ముఖ్యంగా మే నెలలో రష్యా అధ్యక్ష భవనంపై దాడికి యత్నించినప్పటి నుంచి డ్రోన్ల వినియోగం మరింత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బెల్గొరాడ్‌, కుర్క్స్‌ ప్రాంతాలపై ఒక్కొకటి చొప్పున డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు రష్యా వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story