Ukraine: కీవ్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా..

Ukraine: కీవ్‌పై మరోసారి విరుచుకుపడిన రష్యా..
X
ఉక్రెయిన్ కు చెందిన అతిపెద్ద నౌకలలో ఒకటి సింపరోపోల్

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం జరిపినా రష్యా తన దూకుడు తగ్గించలేదు. తాజాగా ఉక్రెయిన్ లోని భారీ నౌకలలో ఒకటైన ‘సింపరోపోల్’పై సముద్ర డ్రోన్లతో విరుచుకుపడింది. ఒడెస్సా తీరంలో మోహరించిన ఈ భారీ నౌకను రష్యా డ్రోన్ ఢీ కొట్టి పేలిపోయింది. దీంతో నౌక సముద్రంలో మునిగిపోయింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యా దాడిని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. ఈ ఘటనలో ఒక నావికుడు చనిపోయాడని, మరికొందరు గాయపడ్డారని వెల్లడించింది. సముద్రంలో గల్లంతైన వారిని కాపాడేందుకు రెస్క్యూ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2019 తర్వాత ఉక్రెయిన్ నావికాదళంలోకి ఎంట్రీ ఇచ్చిన భారీ నౌక ‘సింపరోపోల్’ను రష్యా డ్రోన్లు కూల్చేశాయి. కీవ్ లోని రెండు డ్రోన్ల తయారీ కేంద్రాలపైనా రష్యా క్షిపణి దాడి చేసిందని ఉక్రెయిన్ రాజకీయ నాయకుడు ఇగార్ జింకెవిచ్ పేర్కొన్నారు.

Tags

Next Story