13 April 2022 11:45 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / Ukrainian Bride:...

Ukrainian Bride: ఖరీదైన మేకప్ కిట్ వదిలి.. కాఫీ మెషీన్ తో ప్రియుని వద్దకు..

Ukrainian Bride: ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై బాంబుల వర్షం కురుస్తుండడంతో, చాలా మంది నిత్యావసర వస్తువులను తీసుకుని సూదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

Ukrainian Bride: ఖరీదైన మేకప్ కిట్ వదిలి.. కాఫీ మెషీన్ తో ప్రియుని వద్దకు..
X

Ukrainian Bride:ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై బాంబుల వర్షం కురుస్తుండడంతో, చాలా మంది నిత్యావసర వస్తువులను తీసుకుని సూదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. కానీ ఒక మహిళ మాత్రం తన ఖరీదైన మేకప్ కిట్ ను అక్కడే వదిలేసి కాఫీ మెషీన్ ని తీసుకుని బయల్దేరింది.

అన్నా హోరోడెట్స్కా కేవలం కొన్ని టీ-షర్టులు, కాఫీ మెషీన్‌ని మాత్రమే వెంట తీసుకువెళ్లాలని అనుకున్నారు. ఇది తనకు నానమ్మ ఇచ్చిన బహుమతి అని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

2019లో హోరోడెట్స్కా సోలో ట్రిప్‌ కోసం భారతదేశానికి వచ్చినప్పుడు న్యాయవాది అయిన అనుభవ్ భాసిన్‌ను కలిసింది. ఆమె ఉక్రెయిన్ వెళ్లిన తరువాత కూడా ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగేవి.


మరోసారి రాజస్థాన్ రోడ్ ట్రిప్ కోసం వచ్చింది హోరోడెట్స్కా. అప్పుడే లాక్డౌన్ కూడా కావడంతో ఆమె భాసిన్ కుటుంబంతో కలిసి ఉండాల్సి వచ్చింది. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. అనుభవ్ కుటుంబానికి కూడా ఆమె నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అనంతరం ఉక్రెయిన వెళ్లిపోయింది హోరోడెట్స్కా. మార్చిలో వివాహం చేసుకుందామనుకున్నారు. కానీ అంతలో యుద్ధం వచ్చి పడింది. దీంతో తమ పెళ్లికి యుద్ధం అడ్డుకాకూడదని భావించిన హోరోడెట్స్కా తల్లిని వెంటబెట్టుకుని న్యూఢిల్లీకి బయల్ధేరింది. ఆమెని మెక్సికోలో దింపేసి తాను మాత్రం ఢిల్లీ వచ్చింది.

ఆదివారం అనుభవ్ భాసిన్‌ ను వివాహమాడింది. అంగరంగ వైభవంగా జరిగిన వారి వివాహానికి కుటుంబసభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. భాసిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వారి వివాహానికి సంబంధించిన ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మేము కలిసిన రోజు నుండి ఈ రోజు వరకు మా ప్రయాణం చాలా క్రేజీగా ఉంది, ఈ క్రమంలో మాకు ఎదురైన ప్రతి అడ్డంకిని, ప్రతి సమస్యను అధిగమించాము. మీతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నేను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాను బేబీ. ఇంట్లోకి దయచేయండి." అని భార్య హోరోడెట్స్కాని ప్రేమగా ఆహ్వానించారు అనుభవ్.


కాగా, ఆమె ఉక్రెయిన్ నుంచి తెచ్చిన కాఫీ మెషీన్ చూసి అనుభవ్ కూడా ఆశ్చర్యపోయారు. "అన్నా శిక్షణ పొందిన మేకప్ ఆర్టిస్ట్, కానీ ఈ కాఫీ మెషీన్‌ను ఇక్కడికి తీసుకురావడానికి ఆమె నిజంగా ఖరీదైన మేకప్‌ను వదిలిపెట్టింది. ఈ మెషీన్ మా ప్రేమకథకు నిజమైన హీరో అని నేను భావిస్తున్నాను, "అని మిస్టర్ భాసిన్ పేర్కొన్నాడు.

పెళ్లైన హోరోడెట్స్కా మరోసారి ఉక్రెయిన్ వెళ్లి ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులను, తాను పెంచుకుంటున్న కుక్కపిల్లను తనతో తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.

Next Story