Volodymyr Zelenskyy: ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్

Volodymyr Zelenskyy : రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రపంచ దేశాల సాయం కోరుతున్నారు. రష్యా భీకర పోరుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను మోదీకి వివరించారు. ప్రధాని మోదీతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యరాజ్యసమతి భద్రతా మండలిలో తమకు భారత్ నుంచి రాజకీయ మద్దతు కావాలని మోదీని కోరారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. లక్షమంది రష్యా చొరబాటుదారులు తమ భూభాగంలోకి వచ్చారన్న జెలెన్‌స్కీ.. పుతిన్ సైన్యం దురాక్రమణను కలిసి పోరాడదామని విన్నవించారు. కాగా.. ఉక్రెయిన్‌లోని పరిస్థితిపై ప్రధాని మోదీ.. విచారం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com