Donald Trump: గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ - ఐక్యరాజ్యసమితి ఏమందంటే..

Donald Trump:  గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటామన్న  ట్రంప్ - ఐక్యరాజ్యసమితి ఏమందంటే..
X
ట్రంప్‌కు ఝలక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాలస్తీనాలోని గాజాపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందనే వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. ఇక, తాజాగా గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటేరస్‌ వ్యతిరేకించారు. దీంతో, ట్రంప్‌ నిర్ణయం ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.

గాజాగా విషయంలో ట్రంప్‌ వ్యాఖ్యలపై తాజాగా ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటేరస్‌ స్పందించారు. ఈ క్రమంలో గాజాను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియో గుటేరస్‌ వ్యతిరేకించారు. ఈ సందర్బంగా ట్విట్టర్‌ వేదికగా గుటేరస్‌..‘పాలస్తీనా ప్రజలకు వారి సొంత భూమిలో మనుషులుగా జీవించే హక్కు ఉంది. ఐక్యరాజ్యసమితి.. అక్కడ శాంతి, స్థిరత్వం మరియు పాలస్తీనా ప్రజల విడదీయరాని హక్కులకు పూర్తిగా కట్టుబడి ఉంది. గాజాపై పరిష్కారాల అన్వేషణలో, మనం సమస్యను మరింత దిగజార్చకూడదు. అంతర్జాతీయ చట్టం పునాదికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. ఏ రూపంలోనైనా జాతి ప్రక్షాళనను నివారించడం చాలా అవసరం. గాజా ప్రజలపై భయంకరమైన పరిస్థితుల్లో జీవనం కొనసాగించారు. ఇప్పటికైనా పాలస్తీనియన్లకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

మరోవైపు.. గాజా ప్రాంతంలో తమ దేశ సైన్యాన్ని మోహరించడానికి ట్రంప్‌ సిద్దంగా లేరని వైట​్‌ హౌస్‌ వర్గాలు చెప్పుకొచ్చాయి. గాజా పునర్‌ నిర్మాణంలో అమెరికా భాగస్వామ్యం అవసరమని ట్రంప్‌ విశ్వస్తున్నారని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు, సంచలనాల ట్రంప్‌ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.


Tags

Next Story