United Airlines : ప్రయాణికుడి లిక్కర్ బాటిల్ ఖాళీ.. విమాన సిబ్బంది తాగేశారట

United Airlines : ప్రయాణికుడి లిక్కర్ బాటిల్ ఖాళీ.. విమాన సిబ్బంది తాగేశారట
విమానం దిగి ఇంటికెళ్లి చూశాక సదరు బాటిల్ లో మూడవ వంతు లిక్కర్ మాయమైనట్లు పేర్కొన్నాడు

ఓ ప్రయాణికుడు తీసుకెళ్తున్న ఖరీదైన స్కాచ్ ను తాగేశారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. ఆపై తమకేమీ తెలియనట్లు బాటిల్ కు సీల్ కూడా వేశారు. ఈ ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో జరిగింది. క్రిస్టెఫర్ ఆంబ్లర్ అనే ప్రయాణికుడు తన లగేజీలో ఖరీదైన.. గ్లెన్ మోరాంగీ 'ఎ టేల్ ఆఫ్ కేక్' విస్కీ బాటిల్ ను తీసుకెళ్తున్నాడు. ప్యాక్ చేసినప్పుడు బాటిల్ ఫుల్ గా ఉందని, విమాన సిబ్బంది కూడా సీల్ వేశారని చెప్పాడు. విమానం దిగి ఇంటికెళ్లి చూశాక సదరు బాటిల్ లో మూడవ వంతు లిక్కర్ మాయమైనట్లు పేర్కొన్నాడు. పైగా బాటిల్ కు సీల్ వేసింది వేసినట్లే ఉందని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ట్వీట్ చేసి... సదరు ఎయిర్ లైన్స్ కు ట్యాగ్ చేశాడు. సిబ్బంది తన లిక్కర్ ను దొంగిలించారని ఆరోపించాడు. సదరు విస్కీ ఖరీదు 449.95 పౌండ్లు.. భారత కరెన్సీ ప్రకారం 45వేల 556 రూపాయలుగా ఉంది.

ఈ విషయంపై సదరు ఎయిర్ లైన్స్ స్పందించింది. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు పేర్కొంది. లగేజీ రిజల్యూషన్ సెంటర్ లో రిపోర్ట్ ను ఫైల్ చేయమని అధికారులు కోరారు. ఈ విషయంపై నెటిజన్లు స్పందించారు. లిక్కర్ ను సిబ్బందే దొంగిలించారని నిరూపించడం కష్టమని అన్నారు. మారికొందరు సదరు ప్రయాణికుడిపై జాలీ చూపెడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story