ఘోర ప్రమాదం నుంచి బయటపడిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం

ఘోర ప్రమాదం నుంచి బయటపడిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం
యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌ అయింది. దీంతో డెన్వర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ విమానం ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌ ఫెయిల్‌ అయింది. దీంతో డెన్వర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

అమెరికాలోని డెన్వర్ నుంచి హోనోలూలుకు వెళ్తున్న విమానం ఇంజన్‌కు సడెన్‌గా మంటలు అంటుకున్నాయి. విమానం ప్రమాదానికి గురైందన్న విషయం డెన్వర్‌ పట్టణంలోని వాళ్లకు కూడా కనిపించింది. ఇంజిన్‌ నుంచి విడిపోతున్న విడిభాగాలు డెన్వర్‌ సిటీలోని పలు ఇళ్లపై పడ్డాయి.

విమానం ఇంజిన్‌ పార్ట్స్‌ ఓ ఇంటిపై పడడంతో భారీ రంధ్రం ఏర్పడింది. అదృష్టవశాత్తు విమానంలో ఉన్న వాళ్లకి గాని, విడిభాగాలు పడిన చోట గాని ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బోయింగ్ విమానంలోని 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story