PSLV-37 Rocket: ఎనిమిదేళ్ల తర్వాత..అట్లాంటిక్‌లో పడిన PSLV C3 రాకెట్ శకలాలు

PSLV-37 Rocket: ఎనిమిదేళ్ల తర్వాత..అట్లాంటిక్‌లో పడిన PSLV C3 రాకెట్ శకలాలు
X
మ‌ళ్లీ భూవాతావ‌ర‌ణంలోకి

ఏడేళ్ల క్రితం ఇస్రో చ‌రిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. పీఎస్ఎల్వీ-౩౭ రాకెట్ ద్వారా నింగిలోకి 104 ఉప‌గ్ర‌హాల‌ను పంపారు. ఇప్పుడు ఆ రాకెట్ మ‌ళ్లీ భూ వాతావ‌ర‌ణంలోకి సుర‌క్షితంగా వ‌చ్చేన‌ట్లు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ తెలిపింది. 2017 ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన పీఎస్ఎల్వీ-సీ37ను లాంచ్ చేశారు. దాంట్లో కార్టోశాట్‌-2డీని ప్ర‌ధాన‌ పేలోడ్‌గా తీసుకెళ్లారు. 103 శాటిలైట్ల‌ను కో-ప్యాసింజెర్స్‌గా తీసుకెళ్లారు. 104 ఉప‌గ్ర‌హాల‌ను ఒకేసారి నింగిలోకి పంపి ఆ ప‌రీక్ష ద్వారా ఇస్రో చ‌రిత్ర సృష్టించింది.

శాటిలైట్ల‌ను నిర్దేశిత క‌క్ష్య‌లో విడిచిపెట్టిన త‌ర్వాత‌.. ఆ రాకెట్‌కు చెందిన అప్ప‌ర్ స్టేజ్ పీఎస్4 కూడా క‌క్ష్య‌లోనే ఉండిపోయింది. ఆ స్సేస్ విడిభాగాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేశారు. ప్ర‌స్తుత ఆర్బిటాల్ ఆల్టిట్యూడ్ త‌గ్గిపోయింది. భూ వాతావ‌ర‌ణంలో ఉన్న ఆయష్కాంత శ‌క్తి క్షీణించింది. అక్టోబ‌ర్ ఆరో తేదీన పీఎస్ఎల్వీ రాకెట్ రీ ఎంట్రీ ఇచ్చిన‌ట్లు ఇస్రో అధికారులు చెప్పారు. ఉత్త‌ర అట్లాంటిక్ స‌ముద్రంలో ఆ రాకెట్ కూలిన‌ట్లు భావిస్తున్నారు.

అంత‌ర్జాతీయ డెబ్రిస్ మిటిగేష‌న్ సూత్రాల ప్ర‌కారం రాకెట్ భూ వాతావ‌ర‌ణంలోకి రీ ఎంట్రీ అయిన‌ట్లు ఇస్రో ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఆ ప్రక్రియ అంతా ఇస్రో, దాని IS4OM( ISRO సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్ మెంట్) సౌకర్యం ద్వారా నిశితంగా పరిశీలించబడింది యూఎస్ స్పేస్ కమాండ్, IS4OM రెండూ ఊహించినట్లుగానే PSLV C3 శకలాలు అక్టోబర్ 6, 2024న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంపై పడ్డాయి. అంతరిక్ష శిథిలా నివారణకు భారత్ నిబద్ధతతను ఈ ఈవెంట్ హైలైట్ చేస్తుంది.

Tags

Next Story