US: అమెరికాలో సంక్రాంతి సంబరాలు

US: అమెరికాలో సంక్రాంతి సంబరాలు
X
దివంగత కే. విశ్వనాథ్, జమున, వాణి జయరాంలకు నివాళి

అమెరికాలో 'గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం' ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. దివంగత కే. విశ్వనాధ్, జమున, వాణి జయరాంలకు వందలాది తెలుగు వారి మధ్య నివాళులు అర్పించారు. అనంతరం బాల బాలికల కళా ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఘంటసాల పాటలు సభికులను విశేషంగా అలరించాయి. మాతృభూమికి దూరంగా ఉంటున్నా తెలుగు కళలు, సంప్రదాయాలను ఈ తరానికి చేరువ చేస్తున్నామని సంస్థ అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత రాయబార కార్యాలయం అధికారి రవి కోట, సినీ దర్శకుడు తమ్మా రెడ్డి భరద్వాజ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

Tags

Next Story