US: మరణశయ్యపై భారత విద్యార్థిని

US: మరణశయ్యపై భారత విద్యార్థిని
అర్కనాస్ లో రోడ్డు ప్రమాదం; తీవ్రగాయాలపాలైన భారత విద్యార్ధిని; వెంటిలేటర్ పై ప్రాణాల కోసం పోరాటం....

అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన భారత విద్యార్ధిని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతోంది. కానాస్ లోని విచిటా స్టేట్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోన్న శ్రీ లిఖితా పిన్నం అనే విద్యార్ధిని జనవరి 30న స్నేహితులతో కలసి కారులో ప్రయాణిస్తోంది. అర్కనాస్ వద్ద బెన్టోవిల్ హైవే వద్ద కారు ప్రమాదానికి గురైందని తెలుస్తోంది. రెండు సార్లు కారు పల్టీ కొట్టడంతో లిఖిత తలకు తీవ్రగాయమైంది. ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అటుగా వెళుతోన్న ఓ డ్రైవర్ లిఖిత, ఆమె స్నేహితులను గమనించి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అర్కానాస్ లోని మెర్సీ ఆసుపత్రిలో లిఖితను ఎమర్జెన్సీ వార్డ్ లోకి తరలించారు. చికిత్స కోసం ఆమె సోదరి ప్రారంభించిన గో ఫండ్ మీ అనే పేజ్ ద్వారా ఈ వివరాలు తెలిశాయి. లిఖిత అరుదైన మెదడు గాయానికి గురైందని వైద్యులు ధృవీకరించారు. దీనివల్ల మెదడులో పలుచోట్ల రక్తస్రావం అవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్న లిఖిత, చికిత్సకు స్పందించడంలేదని తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి నెలలు, సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story