US: అమెరికాలో కాల్పులు..ఆరుగురి మృతి

X
By - Subba Reddy |18 Feb 2023 11:30 AM IST
తుపాకితో విరుచుకుపడ్డ దుండగుడు
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేగింది. మిస్సిస్సిప్పీలోని టేట్ కౌంటీలో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఓ షాప్‌లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని అధికారులు వెల్లడించారు. నిందితుడు కారులో పారిపోతుండగా పట్టుకున్నామని చెప్పారు. ఈ నెల 15న మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com