USA: అమెరికాలో దేశబహిష్కరణ ?

అధికారిక గణాంకాల ప్రకారం.. అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లుగా ఉంది. వారిలో వేలాది మంది భారతీయ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు. వారి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోకుండా, రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీల నాయకులు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు.
వివరాల్లోకి వెళితే, అమెరికాలోకి చిన్న వయస్సులో తల్లిదండ్రులతో కలిసి వచ్చి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకుని, తాము కూడా అమెరికన్లమే అని భావించే 2.5 లక్షల మంది పిల్లలను, మీది అమెరికా కాదు, మీరు మీ స్వదేశం వెళ్లాల్సిందే అని అమెరికా చట్టాల్లోని నిబంధనలు చెబుతున్నాయి. చట్టబద్ధమైన వలసదారులు అంటే టెంపరరీ వర్క్ వీసాపై అమెరికాకు వచ్చేవారు తమతో పాటు పిల్లలను డిపెండెంట్ లుగా తీసుకువస్తారు. అక్కడే వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అయితే, అమెరికా చట్టాల ప్రకారం, ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండగానే, వారికి డిపెండెంట్ హోదా ముగుస్తుంది. అంటే, వారు డిపెండెంట్లు గా అమెరికాలో నివసించడానికి అర్హత కోల్పోతారు. 21 ఏళ్లు నిండిన తర్వాత వారిని యునైటెడ్ స్టేట్స్ నుండి బహిష్కరించబడే ప్రమాదం ఉంది.
యూఎస్ లో ఈ సమస్యను ‘ఏజింగ్ ఔట్ ’ అంటున్నారు. ఈ పిల్లలనే 'డాక్యుమెంటెడ్ డ్రీమర్స్అంటున్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాలు- ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ (ఐఎన్ఏ)- పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి, ఒకవేళ, అప్పటికీ వారి తల్లిదండ్రులు శాశ్వత నివాస హోదాను పొందకపోతే, ఆ పిల్లలు అమెరికాను విడిచిపెట్టాలని నిర్దేశిస్తున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపి) సర్వే నవంబర్ 2023 ప్రకారం, డిపెండెంట్లతో సహా 12 లక్షలకు పైగా భారతీయులు ఈబీ -1, ఈబీ -2, ఈబీ -3 వీసా కేటగిరీలలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com