యుఎస్ ఆర్మీ వెటరన్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య..

యుఎస్ ఆర్మీ వెటరన్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఆత్మహత్య..
X
ఆమె ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు, మిచెల్ యంగ్ తన కుమార్తె కోసం హృదయపూర్వక పుట్టినరోజు సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఆమె ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు, మిచెల్ యంగ్ తన కుమార్తె కోసం పుట్టినరోజు సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

యుఎస్ ఆర్మీ స్టాఫ్ సార్జెంట్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, 34 ఏళ్ల ఒంటరి తల్లి మిచెల్ యంగ్ శనివారం ఆత్మహత్య చేసుకుంది. మిచెల్ యంగ్ కి 12 ఏళ్ల కుమార్తె గ్రేసీ ఉంది.

"మా మంచి స్నేహితురాలు, క్రీడాకారిణి మిచెల్ ఆత్మహత్య చేసుకోవడం నా హృదయాన్ని కలచి వేస్తోంది. ఎవరైనా ఏం చేస్తున్నారో, వారు ఎలాంటి రాక్షసులతో పోరాడుతున్నారో మీకు ఎప్పటికీ తెలియదు అని స్టాఫ్ సార్జెంట్ యంగ్ స్నేహితురాలు సారా మైనే GoFundMe లో రాశారు.

మిలిటరీలో పనిచేస్తూనే, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఉంది మిచెల్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 100,000 మంది ఫాలోయింగ్ ఉన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే, ఆమె ఫ్యాషన్ బ్రాండ్‌ల కోసం మోడల్‌గా మారింది.

సెప్టెంబరులో ఆత్మహత్య నిరోధక వారంలో, ఆమె తన అనుభవాలను ప్రతిబింబిస్తూ ఒక పోస్ట్‌ను పంచుకుంది. తనకి 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన అన్నయ్య ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలను తీసుకున్నాడని వెల్లడించింది. ఆ సంఘటన తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంత కలచి వేసిందో పంచుకుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, మానసికంగా బాధపడుతున్న వారిని గుర్తించి అక్కున చేర్చుకోవాలని ఆమె తెలిపారు.

అన్నయ్య ఆత్మహత్య గురించి మాట్లాడిన ఆరునెలలకే మిచెల్ కూడా బలవంతంగా తన ప్రాణాలు తీసుకోవడం దురదృష్టకరం. మిచెల్ యంగ్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అస్పష్టంగా ఉన్నాయి.

"మిచెల్ తన కుమార్తె గ్రేసీతో జీవించి ఉంది. తల్లి ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు. గ్రేసీకి అవసరమైన సహాయం ఏదైనా చేస్తాము కానీ అమ్మ ప్రేమను అందించలేమని మిచెల్ స్నేహితురాలు తెలిపింది.

Tags

Next Story