Employees : మీటింగ్‌కు రాలేదని 99 మంది ఉద్యోగులపై వేటు

Employees : మీటింగ్‌కు రాలేదని  99 మంది ఉద్యోగులపై వేటు
X
ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదంటూ తొలగింపు

మార్నింగ్ సమావేశానికి హాజరు కాలేదని అమెరికాకు చెందిన ఓ కంపెనీ సీఈవో ఏకంగా 99 మంది ఉద్యోగులను తొలగించాడు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీలో ఉన్నదే 111 మంది. ఈ ఉద్యోగాల తొలగింపునకు సంబంధించి ఓ బాధితుడు రెడ్డిట్‌లో రాసుకొచ్చాడు. ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ ఓ మ్యూజిక్ కంపెనీ. తాను సంగీత వాయిద్యాలను విక్రయించే కంపెనీలో చేరానని, చేరిన గంటలోనే తనను తొలగించారని రెడ్డిట్‌లో తొలగింపు గురించి బాధితుడు రాసుకొచ్చాడు. ఉద్యోగాన్ని సీరియస్‌గా తీసుకోలేదంటూ సీఈవో బాల్డ్విన్ ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పాడు.

ఒప్పందం ప్రకారం చేయాల్సిన పనులు చేయలేదని, అలాగే సమావేశాలకు హాజరు కావడంలో విఫలమయ్యారని సీఈవో చెప్పాడని తెలిపాడు. అందుకే కాంట్రాక్ట్‌ను (ఉద్యోగ అగ్రిమెంట్) రద్దు చేస్తున్నట్లు చెప్పాడన్నాడు. కంపెనీకి చెందిన వస్తువులు ఏవైనా తమ వద్ద ఉంటే వెనక్కి ఇవ్వాలని సూచించాడని, కంపెనీకి చెందిన ఖాతాల నుంచి సైన్-ఔట్ కావాలని చెప్పాడని వెల్లడించాడు.

జీవితాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశమిస్తే ఉపయోగించుకోలేదని చెప్పాడని తెలిపాడు. ఈ సమావేశానికి హాజరైన వారు మాత్రం సంస్థలో ఉంటారని చెప్పినట్లు ఆ బాధితుడు వెల్లడించాడు. కాగా, సీఈవో తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

Tags

Next Story