US: కాలిఫోర్నియాలో 30 మంది భారతీయుల అరెస్టు

అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవ్యతిరేకంగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారిని అరెస్ట్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. తాజాగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న 30 మంది భారతీయులను యూఎస్ బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు.
కాలిఫోర్నియాలోని ఎల్ సెంట్రో సెక్టర్‌లో జరిగిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కొందరు కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులతో (సీడీఎల్) సెమీ ట్రక్ వాహనాలను నడుపుతుండగా.. మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు ఇంటర్ స్టేట్ హైవేలు, ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) వెల్లడించింది. అందులో 30 మంది భారతీయులు కాగా, ఇద్దరు ఎల్ సాల్వాడార్‌కు చెందినవారు. ఇక మిగిలిన వారు చైనా, ఎరిట్రియా, హైతీ, హోండురాస్, మెక్సికో, రష్యా, సొమాలియా, తుర్కియే, ఉక్రెయిన్ తదితర దేశాలకు చెందినవారని అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

