US: వలసదారుల పిల్లలే ట్రంప్ సర్కార్ టార్గెట్

US: వలసదారుల పిల్లలే ట్రంప్ సర్కార్ టార్గెట్
X
అమెరికాలో 30 మంది భారతీయుల అరెస్ట్

కా­లి­ఫో­ర్ని­యా­లో 30 మంది భా­ర­తీ­యు­ల­ను అరె­స్ట్ చే­సా­రు పో­లీ­సు­లు. అమె­రి­కా­లో­ని కా­లి­ఫో­ర్ని­యా రా­ష్ట్రం­లో బో­ర్డ­ర్‌ పె­ట్రో­ల్‌ ఏజెం­ట్లు 30 మంది భా­ర­తీ­యు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్న­ట్టు అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. వీ­రి­లో కొం­ద­రు కమ­ర్షి­య­ల్ ట్ర­క్ డ్రై­వ­ర్ లై­సె­న్స్‌­ల­తో అక్ర­మం­గా కసె­మీ ట్ర­క్కు­లు నడు­పు­తు­న్నా­ర­ని, మరి­కొం­ద­రు సరైన పత్రా­లు లే­కుం­డా అక్ర­మం­గా ని­వ­సి­స్తు­న్నా­ర­ని తె­లి­పా­రు. ఇం­ట­ర్‌ ఏజె­న్సీ కా­ర్య­క­లా­పా­ల్లో భా­గం­గా ఇమి­గ్రే­ష­న్ చె­క్‌­పో­స్టుల వద్ద తని­ఖీ­లు ని­ర్వ­హిం­చ­గా, మొ­త్తం 49 మంది అక్రమ వల­స­దా­రు­లు­గా గు­ర్తిం­చి­న­ట్టు యూ­ఎ­స్ CBP మరో ప్ర­క­ట­న­లో స్ప­ష్టం చే­సిం­ది. అక్రమ వల­స­లు, ని­బం­ధ­నల ఉల్లం­ఘ­న­ల­పై కఠి­నం­గా వ్య­వ­హ­రిం­చేం­దు­కు చే­ప­ట్టిన ప్ర­త్యేక ఆప­రే­ష­న్ల­లో భా­గం­గా ఈ అరె­స్టు­లు చే­సి­న­ట్టు అధి­కా­రు­లు తె­లి­పా­రు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్‌ సర్కారు విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్‌ వీసా లు, కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీని ఇప్పటికే నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య బోర్డర్ అధికారులు వీరిని అరెస్ట్ చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రొ­టె­క్ష­న్ ఏజెం­ట్లు ని­ర్వ­హిం­చిన ఆప­రే­ష­న్‌­లో వా­ణి­జ్య డ్రై­విం­గ్ లై­సె­న్స్‌­ల­తో సె­మీ­ట్ర­క్కు­లు నడు­పు­తు­న్న 42 మంది అక్రమ వల­స­దా­రు­ల­ను అదు­పు­లో­కి తీ­సు­కు­న్నా­రు. వా­రి­లో 30 మంది భా­ర­త్‌­కు చెం­ది­న­వా­రు కాగా మి­గి­లి­న­వా­రు చైనా, మె­క్సి­కో, రష్యా, తు­ర్కి­యే మొ­ద­లైన దే­శా­ల­కు చెం­ది­న­వా­ర­ని అధి­కా­రు­లు వె­ల్ల­డిం­చా­రు. అనం­త­రం కా­లి­ఫో­ర్ని­యా­లో­ని వా­ణి­జ్య ట్ర­క్కిం­గ్ కం­పె­నీ­ల­ను లక్ష్యం­గా చే­సు­కొ­ని చే­ప­ట్టిన ఆప­రే­ష­న్ ‘హైవే సెం­టి­నె­ల్‌’లో మరో ఏడు­గు­రు అక్రమ వల­స­దా­రు­ల­ను అరె­స్టు చే­సి­న­ట్లు తె­లి­పా­రు. దీం­తో ఇప్ప­టి­వ­ర­కు అరె­స్టైన వారి సం­ఖ్య 49కు చే­రిం­ది. వలస చట్టాల ఉల్లం­ఘ­న­ల­ను ని­వా­రిం­చ­డం, దే­శం­లో­ని హై­వే­ల­ను రక్షిం­చ­డం కోసం ఈ చర్య­లు తీ­సు­కుం­టు­న్నా­మ­న్నా­రు. అగ్ర­రా­జ్యం అధ్య­క్షు­డి­గా డొ­నా­ల్డ్‌ ట్రం­ప్‌ అధి­కా­రం చే­ప­ట్టాక అమె­రి­కా­లో సగటు భా­ర­తీ­యు­డి జీ­వి­తం బి­క్కు­బి­క్కు­మం­టూ గడు­స్తోం­ది. ఇం­డి­య­న్ల పరి­స్థి­తే కాదు.. అన్ని దే­శాల వారి పరి­స్థి­తీ ఇదే. అయి­తే మనది కొం­చెం ఎక్కువ. ది­న­దిన గండం.. నూ­రే­ళ్ల ఆయు­ష్ణు­లా.. ఎప్పు­డు ఏ చట్టం­తో కొ­డ­తా­డో.. ఏ రూ­లు­ను ఝు­లి­పి­స్తా­డో.. ఏ వైపు నుం­చి వేటు వే­స్తా­డో­న­న్న చం­దం­లా మా­రిం­ది.

వలసదారుల పిల్లలపై విషం

వల­స­దా­రుల పి­ల్ల­ల­పై అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ సల­హా­దా­రు స్టీ­ఫె­న్ మి­ల్ల­ర్ విషం కక్కా­రు. 70 ఏళ్లు­గా వల­స­దా­రు­ల­కు పు­ట్టిన మి­లి­య­న్ల మంది పి­ల్ల­లు అమె­రి­కా­కు చే­సిం­ది తక్కు­వే­న­ని వ్యా­ఖ్య­లు చే­శా­రు. సో­మా­లి­యా వల­స­దా­రు­ల­ను ఉదా­హ­ర­ణ­గా చూ­పు­తూ ఫా­క్స్‌ న్యూ­స్‌­కు ఇచ్చిన ఇం­ట­ర్వ్యూ­లో అం­ద­రి పైనా వ్యా­ఖ్య­లు చే­శా­రు. ‘‘ఇన్ని వలస సమూ­హా­ల్లో ఏ ఒక్క తరం వి­జ­య­వం­తం కా­లే­దు. వీ­రం­తా అమె­రి­కా­కు చే­సిం­ది ఏమీ లేదు. అం­దు­కు సో­మా­లి­యా స్ప­ష్ట­మైన ఉదా­హ­రణ. సం­క్షేమ పథ­కా­ల­ను భా­రీ­స్థా­యి­లో వి­ని­యో­గిం­చు­కుం­టు­న్నా­రు. నేర కా­ర్య­క­లా­పా­ల్లో వీరి సం­ఖ్య పె­రు­గు­తూ­నే ఉంది’’ అని తీ­వ్ర వ్యా­ఖ్య­లు చే­శా­రు. జన్మ­తః పౌ­ర­స­త్వం కల్పిం­చే పద్ధ­తి­ని రద్దు చే­స్తూ జారీ చే­సిన కా­ర్య­ని­ర్వా­హక ఆదే­శా­న్ని సమ­ర్థిం­చా­ల­ని ట్రం­ప్‌ యం­త్రాం­గం అమె­రి­కా సు­ప్రీం­కో­ర్టు­కు వి­జ్ఞ­ప్తి చే­స్తో­న్న సం­గ­తి తె­లి­సిం­దే. ఈ నే­ప­థ్యం­లో మి­ల్ల­ర్ నుం­చి స్పం­దన వచ్చిం­ది.

వేతనం ఎక్కువుంటేనే హెచ్‌-1బీ

హె­చ్‌-1బీ వీ­సాల జారీ ప్ర­క్రి­య­లో కీలక మా­ర్పు చే­ప­ట్టేం­దు­కు అమె­రి­కా సి­ద్ధ­మైం­ది. ప్ర­స్తు­త­ము­న్న ర్యాం­డ­మ్‌ లా­ట­రీ వి­ధా­నా­ని­కి స్వ­స్తి పలి­కి.. అధిక నై­పు­ణ్యా­లు, ఎక్కువ వే­త­నా­లు ఉన్న వ్య­క్తు­ల­కు ఆ వీ­సాల జా­రీ­లో ప్రా­ధా­న్య­మి­చ్చే సరి­కొ­త్త వ్య­వ­స్థ­ను దాని స్థా­నం­లో ప్ర­వే­శ­పె­ట్టా­ల­ని ని­ర్ణ­యిం­చిం­ది. డి­పా­ర్ట్‌­మెం­ట్‌ ఆఫ్‌ హోం­ల్యాం­డ్‌ సె­క్యూ­రి­టీ (డీ­హె­చ్‌­ఎ­స్‌) మం­గ­ళ­వా­రం ఓ ప్ర­క­ట­న­లో ఈ వి­ష­యా­న్ని వె­ల్ల­డిం­చిం­ది. ఈ కొ­త్త పద్ధ­తి­కి సం­బం­ధిం­చిన ని­బం­ధన వచ్చే ఏడా­ది ఫి­బ్ర­వ­రి 27 నుం­చి అమ­ల్లో­కి వస్తుం­ద­ని తె­లి­పిం­ది. 2027 ఆర్థిక సం­వ­త్స­రం హె­చ్‌-1బీ క్యా­ప్‌ రి­జి­స్ట్రే­ష­న్‌ సీ­జ­న్‌­కు కూడా ఇదే వర్తి­స్తుం­ద­ని వె­ల్ల­డిం­చిం­ది. అమె­రి­కా కా­ర్మి­కుల ఉద్యోగ అవ­కా­శా­ల­తో పాటు పని పరి­స్థి­తు­లు, వే­త­నా­ల­ను పరి­ర­క్షిం­చేం­దు­కే నూతన ని­బం­ధ­న­ను అమ­ల్లో­కి తీ­సు­కొ­స్తు­న్న­ట్లు పే­ర్కొం­ది. హె­చ్‌-1బీ వీ­సాల జా­రీ­కి ప్ర­స్తు­త­ము­న్న లా­ట­రీ వి­ధా­నా­న్ని దు­ర్వి­ని­యో­గం చే­స్తూ చాలా కం­పె­నీ­లు వి­దే­శాల నుం­చి తక్కువ వే­త­నా­ల­కే ఉద్యో­గు­ల­ను రప్పిం­చు­కుం­టు­న్నా­య­ని గు­ర్తు­చే­సిం­ది. ఇప్పు­డు ట్రం­ప్ వి­ధా­నా­ల­పై తీ­వ్ర వి­మ­ర్శ­లు వ్య­క్త­మ­వు­తు­న్నా­యి.

Tags

Next Story