Chaina-US: చైనా, అమెరికా మధ్య కనిష్ఠ స్థాయిలో సంబంధాలు

Chaina-US: చైనా, అమెరికా మధ్య కనిష్ఠ స్థాయిలో సంబంధాలు
X
బరాక్ ఒబామా హయాంలో అమెరికాలో చదివే చైనా విద్యార్థుల సంఖ్య ఏకంగా 98,235 నుంచి 3,50,755 కి పెరిగింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.

కోవిడ్ విజృంభణ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు హెచ్చించిన క్రమంలో చైనా, అమెరికాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయిల్లో ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకు ముందు పర్యాటకం, విద్య, సాహిత్యం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ధృడ బంధం పెచ్చురిల్లిన్నట్లుగా కనబడుతోంది.

కోవిడ్ అనంతరం ఆంక్షలు, ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం వంటివి సాంస్కృతిక బంధాలు, పర్యాటకుల సంఖ్యని, విద్య, ఉద్యోగాల కోసం వచ్చే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. 2000, 2010 సంవత్సారాల మధ్య కాలంలో అమెరికా, చైనాల మధ్య సంస్కృతి సంబంధాలను ఇచ్చిపుచ్చుకునే వారు. డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇరుదేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, జో బైడెన్ హయాంలోనూ కొనసాగాయి.

విదేశీ విద్య..

బరాక్ ఒబామా హయాంలో అమెరికాలో చదివే చైనా విద్యార్థుల సంఖ్య ఏకంగా 98,235 నుంచి 3,50,755 కి పెరిగింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. చైనా నుంచి వచ్చే విద్యార్థులపై ఆంక్షలు విధించడమే దీనికి కారణం. ఇదే సమయంలో చైనాలో చదివే యుఎస్ విద్యార్థుల సంఖ్య కూడా అదే రీతిలో తగ్గింది. 2018-19 సంవత్సరంలో 11,639 మంది విద్యార్థులు అక్కడ విద్యనభ్యసించగా, 2020-21కి ఆ సంఖ్య 382కి తగ్గింది.


సినిమా, సాహిత్యం...

2017 సంవత్సరం నుంచి అమెరికాలో ఇంగ్లీష్ భాషలోకి అనువదింపబడి, ప్రచురింపడే పబ్లికేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇదే విధంగా చైనాలో ప్రచురితమైన అమెరికన్ బుక్స్ 2017లో 267 ఉండగా, 2022కి 146కి తగ్గాయి.

హాలివుడ్‌లో సినిమాలకు కూడా ఆదరణ తగ్గింది. చైనా సినిమాలకు అమెరికాలో ఎప్పుడూ ఆదరణ లేదు. 2022 నుంచి చైనాలో స్థానిక సినిమాలకు 85 శాతం మార్కెట్ వాటా ఉంది. దశాబ్దం క్రితం ఈ సంఖ్య 50 శాతంగానే ఉండేది.

పర్యాటకం..

కోవిడ్ విజృంభణ పర్యాటకమే ఆదాయ వనరుగా ఉన్న దేశాలను కకావికలం చేసింది. పలు దేశాల ఇతర దేశాల పర్యాటకులు, ప్రజలకు తమ దేశాల్లోకి రాణించకుండా ఆంక్షలు విధించాయి. ఈ విషయంలో చైనా మరీ ఎక్కువ ఆంక్షలకు గురైంది.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తగ్గుముఖం ప్రారంభమవగా, 2019 కొవిడ్‌లో ఈ సంఖ్య దారుణంగా పడిపోయింది. 2023లో మే నెలలో కేవలం 87,600 మంది పర్యాటకులు మాత్రమే అమెరికాను సందర్శించగా, ఈ సంఖ్య 2019లో 2,55,00గా ఉండటం గమనార్హం.


Tags

Next Story