Florida Storm : నౌకపై విరుచుకుపడిన తుఫాను

Florida Storm : నౌకపై విరుచుకుపడిన తుఫాను
తుఫాను తాకిడికి అతలాకుతలమైన నౌక, ప్రయాణీకుల బెంబేలు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతంలో తుఫాను కాసేపు బీభత్సం సృష్టించింది. సముద్రంలో చెలరేగిన తుఫాను ఒక క్రూయిజ్ ను తాకడంతో దానిలోని వస్తువులు గాలిలో ఎగిరిపడ్డాయి. ఫ్లోరిడాలోని పోర్ట్ కెనావెరల్ వద్ద ఆగి ఉన్న రాయల్ కరేబియన్ క్రూజ్ ను హరికేన్ తాకింది. అది మరి కాసేపట్లో ఫ్లోరిడా నుంచి బహమాకు బయలుదేరనుంది. కరెక్ట్ గా అదే సమయంలో తుఫాను దానిని తాకింది. షిప్పులోని వస్తువులన్నీ ఎగిరిపడ్డాయి. కుర్చీలు, లాంచ్ చైర్స్, పెద్ద పెద్ద గొడుగులు, చిన్న చిన్న వస్తువులు సైతం ఎగరడం ప్రారంభించాయి. వాటిలో కొన్ని ప్రయాణికుల మీద పడబోయినప్పటికి వారు తప్పించుకున్నారు. జనాలు ఇష్టం వచ్చినట్టు పరుగులు పెట్టారు తమ వారిని రక్షించుకోవడం కోసం నానా బాధలు పడ్డారు. నడుస్తున్న వారు సైతం కిందకి పడిపోతూ ఉండటంతో కూర్చుని జారుకుంటూ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకున్నారు.

అయితే, ఈ ఫ్లాష్ తుఫానులో ప్రయాణీకులెవరూ తీవ్రంగా గాయపడలేదని రాయల్ కరీబియన్ మేనేజ్మెంట్ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, తుఫాను సమయంలో గాలి వేగం గంటకు 90-96 కి.మీ. ఉన్నట్టు అంచనా. తరువాత ఈ షిప్ నాసావుకు ఉత్తరాన 55 మైళ్ల దూరంలో రాయల్ కరీబియన్ వారు నిర్వహించే ఓ ద్వీపానికి సురక్షితంగా చేరుకుంది. జూన్ నుంచి నవంబర్ చివరి వరకు అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్ సీజన్ ప్రారంభమవుతుంది. అలాంటి సమయంలో ఇటువంటి సంఘటనలు జరగడం సర్వ సాధారణం అని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు US మిడ్‌వెస్ట్ మరియు సౌత్‌లో టోర్నడోలు, ఉరుములతో కూడిన తుఫానులు వచ్చాయి. ఈ ఘటన లో డజన్ల కొద్దీ ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇండియానా, అర్కాన్సాస్‌లలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అనేక మధ్య రాష్ట్రాలలో వాతావరణం లో మార్పు కనిపించింది.

Tags

Read MoreRead Less
Next Story