US: పాఠశాలలో కాల్పులు.. ఆరుగురిని కాల్చి చంపిన మాజీ విద్యార్థి

US: నాష్‌విల్లే పాఠశాలలో ఆరుగురిని కాల్చి చంపిన మహిళా షూటర్ నేరం తర్వాత తప్పించుకోవడానికి మ్యాప్‌ను ఉపయోగించింది. "ఒక విషాదకరమైన ఉదయం, నాష్‌విల్లే పాఠశాల కాల్పులను అనుభవించడానికి భయంకరమైన, పొడవైన కమ్యూనిటీల జాబితాలో చేరారు..." అని నాష్‌విల్లే మేయర్ ట్వీట్ చేశారు. నాష్‌విల్లేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో సోమవారం నాడు ఒక మహిళా షూటర్ అటాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులు జరపడంతో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చిచంపారు. నిందితురాలు పాఠశాల మాజీ విద్యార్థి. కాల్పుల తర్వాత తప్పించుకోవడానికి లొకేషన్ మ్యాప్‌లను ఉపయోగించింది. అయినా పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయింది. మెట్రో నాష్‌విల్లే పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ట్వీట్‌లో కాల్పుల ఘటన గురించి తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com