Gaza: బందీల ఆచూకీ కోసం రంగంలోకి దిగిన అమెరికా డ్రోన్లు
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు.. వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతోపాటు అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. దీంతో గాజా నగరంలో బందీల ఆచూకీ కోసం అమెరికా దేశానికి చెందిన డ్రోన్లు యత్నిస్తున్నాయి. హమాస్ 200 మందిని బందీలుగా పట్టుకోగా వారిలో పదిమంది అమెరికన్లు ఉన్నారని అమెరికా అధికారులు చెప్పారు. అమెరికా బందీలను విడిపించేందుకు గాజాపై యూఎస్ నిఘా సేకరణ డ్రోన్లు ఎగురవేస్తురన్నట్లు ఓ అధికారి చెప్పారు. హమాస్ సొరంగాల్లో బందీలను దాచి ఉంచవచ్చనే అనుమానంతో యూఎస్ డ్రోన్లు వారి కోసం గాలిస్తున్నాయి.
అమెరికా రంగంలోకి దింపిన నిఘా డ్రోన్లు గాజా గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్‌ను సేకరిస్తున్నాయి. అయితే, వారం క్రితం నుంచే ఇవి బందీల కోసం వెతుకులాట మొదలెట్టాయని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయి. గాజాలోని భూగర్భ సొరంగాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులు చేస్తోంది. గాజాకు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. పౌరులు దక్షిణ గాజాకు పారిపోవాలని ఇజ్రాయెల్ సూచించింది. హమాస్ యోధులు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ దేశంలో 1400మంది మరణించారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార బాంబు దాడిలో 9,061 మందిని చంపింది.
మరోవైపు గాజా సిటీని ఇజ్రాయిల్మిలిటరీ చుట్టుముట్టేసింది. గాజా పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న హమాస్ కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన నేటికి 28 రోజులైంది. గాజాలో ఇప్పటి వరకు సుమారుగా 10 వేల మంది మరణించారు. దాంట్లో 3760 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దాడి తర్వాత హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడి ముగింపునకు చేరుకోవడం లేదు. ఇంతలో హమాస్, హిజ్బుల్లా గత రాత్రి సెంట్రల్ ఇజ్రాయెల్‌పై భారీ దాడిని కూడా ప్రారంభించాయి. ఈ దాడిలో ఓ వైపు పలు ఇళ్లు దహనమయ్యాయి. మరోవైపు పలు వాహనాలు దహనం అయ్యాయి. హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం రెండోసారి ఇజ్రాయెల్ చేరుకోనున్నారు.
లక్షలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ చేయమని ఇజ్రాయెల్ పదేపదే పిలుపునిచ్చినప్పటికీ, ఉత్తర గాజాలో పోరాట మార్గంలోనే ఉన్నారు. గాజాలోని బురీజ్ శరణార్థుల శిబిరంపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం 15 మంది మరణించారు. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ స్థానాలపై పలుసార్లు దాడులు చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com