Vladimir Putin : రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి ..అసలు ప్రయత్నించలేదని అమెరికా పత్రిక కథనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా ఉక్రెయిన్, పుతిన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ స్పష్టం చేసింది. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది. అయితే రష్యా అధ్యక్షుడి నివాసంపై ఉక్రెయిన్ దాడికి ప్రయత్నం చేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీఐఏ తేల్చి చెప్పింది.
పుతిన్ వ్యక్తిగత నివాసం ఉన్న ప్రాంతంలోని సైనిక లక్ష్యాలపై దాడి చేయాలని ఉక్రెయిన్ యోచిస్తోందని, అయితే ఆయన ఇంటికి అత్యంత సమీపంలో సైనిక స్థావరాలు ఏవీ లేవని ఒక అమెరికా అధికారి వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ప్రచురించింది.
నోవ్‌గొరొడ్ ప్రాంతంలో పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా క్రెమ్లిన్ పేర్కొంది. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను అన్నింటినీ నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని రష్యా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా విడుదల చేసింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖండించిన విషయం తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

