Hijack : కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం..

Hijack :  కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం..
X
ప్రయాణికుడి కాల్పుల్లో దుండగుడు మృతి

అమెరికాలో ఒక వ్యక్తి విమానాన్ని హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కత్తితో బెదిరించి తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికుడి అప్రమత్తమై తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్పులు జరపడంతో దుండగుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెలీజ్‌‌లో చోటుచేసుకుంది.

బెలీజ్‌లో ట్రాపిక్ ఎయిర్‌కు చెందిన చిన్న విమానం గాల్లోకి ఎగిరింది. శాన్‌పెడ్రోకు విమానం వెళ్తోంది. ఇంతలో ఒక ప్రయాణికుడు ఉన్నట్టుండి కత్తితో హంగామా సృష్టించాడు. కత్తితో బెదిరించి విమానాన్ని తన అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించాడు. కత్తితో దాడి చేయడంతో ముగ్గురు ప్రయాణికులు గాయాలు పాలయ్యారు. దీంతో మిగతా వారంతా భయాందోళనకు గురయ్యారు. మరో ప్రయాణికుడు అప్రమత్తమై తన దగ్గర ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. అంతే అక్కడికక్కడే దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు. దుండగుడు అకిన్యేలా సావా టేలర్‌(49)గా గుర్తించారు.

విమానంలో మొత్తం 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. దుండగుడి చర్యతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఇక కాల్పులు జరిపిన ప్రయాణికుడిని పోలీసులు ‘హీరో’గా అభివర్ణించారు. దుండగుడి చర్యతో విమానం రెండు గంటలు గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం సేఫ్‌గా విమానం ల్యాండ్ అయింది.

ఇక దుండగుడు విమానం లోపలికి కత్తి ఎలా తీసుకెళ్లాడనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కత్తి దాడిలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. తోటి ప్రయాణికుడు జరిపిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని పేర్కొన్నారు. నిందితుడు అమెరికా పౌరుడేనని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

Tags

Next Story