USA: అమానవీయం...టీనేజర్ కొడుకును భర్తలా మార్చుకున్న తల్లి

అమెరికాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. కామాంధురాలైన ఓ తల్లి తన కన్న బిడ్డని బానిసగా మార్చుకుంది. పిల్లాడికి అబద్దం చెప్పి సుమారు దశాబ్దం పాటు వాడిని శృంగార బానిసగా మార్చి వాడుకుందంటూ ఫాక్స్ న్యూస్ అనే ఓ వార్త పత్రిక విడుదల చేసిన కథనం సంచలనం సృష్టించింది.
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం ఒక టీనేజర్ కనపడకుండా పోయాడు. ఇప్పుడు వారం రోజుల క్రితం అతను ఓ చర్చ్ బయట కనిపించాడు. ఓ మానవ హక్కుల కార్యకర్త అతనిని గుర్తించి మాట్లాడినప్పుడు సభ్య సమాజం తలదించుకునేలా కొన్ని హేయమైన అంశాలు బయటపడ్డాయి.
బాధితుడి పేరు రూడీ ఫరియస్. తల్లి పేరు జేనీ శాంటన. 17 ఏళ్లు ఉన్నప్పుడు, 2015లో ఫరియస్ రెండు పెంపుడు శునకాలతో వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కుక్కలు కనిపించినా అతడి జాడమాత్రం లేకుండా పోయింది. అయితే రూడి ఇన్ని రోజులూ తల్లితోనే ఉన్నాడని, ఆమె అతడిని సెక్స్ బానిసగా ఉపయోగించుకుందని స్థానిక హక్కుల కార్యకర్తలు సంచలన ఆరోపణలు చేశారు. కుమారుడిని బంధించిన తల్లి, అతను తన తండ్రి పాత్ర పోషించాలని, అంటే తనకు భర్తలా వ్యవహరించాలని కోరిందని స్థానిక హక్కుల కార్యకర్త క్వానెల్ తెలిపారు. ఈ విషయం బయటపెడితే చిక్కుల్లో పడతావని రూడి ని హెచ్చరించినట్టుగా వారు చెబుతున్నారు. హోస్టన్ పోలీస్ విభాగం అధికారులు రూడీ ఫరియస్, అతడి తల్లి జేనీ శాంటనలను ఆ కార్యకర్త సమక్షంలో ఓ హోటల్‌లో ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేశారు. కుమారుడిపై తల్లి వేధింపులకు పాల్పడినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, వీటి ఆధారంగా విచారించబోమని దర్యాప్తు అధికారులు జిల్లా అటార్నీకి తెలిపారు. అయితే, కార్యకర్త మాత్రం ఆరోపణలు నిజమేనని వాదిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com