USA: అమెరికాలో విజృంభిస్తున్న మరో ప్రమాదకర వ్యాధి..

USA: అమెరికాలో విజృంభిస్తున్న  మరో ప్రమాదకర వ్యాధి..
X
పిల్లుల నుంచి మనుషులకు..

ప్రాణంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి.. నాలుగు సంవత్సరాల పాటు సతమతమైంది అమెరికా. కరోనా వల్ల అత్యధిక మరణాలు నమోదైంది ఇక్కడే. సుమారు 11.96 లక్షల మంది కోవిడ్‌కు బలి అయ్యారు. పాజిటివ్ కేసుల నమోదులోనూ అమెరికాదే అగ్రస్థానం. అయితే ఇప్పుడు అగ్రరాజ్యాన్ని మరో ప్రమాదకర వ్యాధి బయటపడం కలకలం రేపింది. 8 సంవత్సరాల తర్వాత ఈ వ్యాధి మళ్లీ రావడం ఇదే మొదటిసారి. అదే బ్లుబోనిక్ ప్లేగ్ ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది.

తాజాగా ఒరెగాన్ స్టేట్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. అక్కడ నివసిస్తున్న ఓ వ్యక్తి పిల్లిని పెంచుకుంటున్నాడు. దాని నుంచే ఆ వ్యక్తికి ఈ ప్లేగ్ వ్యాధి సోకినట్లు ‘యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెంట్‘ తెలిపింది. దీంతో ఈ వ్యాధి విస్తరించకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాల్లో అధికంగా ఈ ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంటుంది.

2016లో న్యూ మెక్సికో, నార్తర్న్ అరిజోనా, సదరన్ కొలరాడో, కాలిఫోర్నియా, సదరన్ ఒరెగాన్, నెవడాల్లో పలువురు ఈ వ్యాధికి గురయ్యారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కవ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. దీన్ని నివారించగలిగామని అప్పట్లో అమెరికా తెలిపింది. కానీ ఇప్పుడు మళ్లీ ఒరెగాన్ స్టేట్‌లో ఇది బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ ఒరెగాన్‌లోని.. డెశాటె కంట్రీలో ఈ బ్యుబోనిక్ ప్లేగ్ వ్యాధి బయటపడినట్లు ది న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.

Tags

Next Story