Joe Biden : చొక్కా లేకుండా జో బిడెన్! ఫొటోలు వైరల్..!

Joe Biden : చొక్కా లేకుండా జో బిడెన్!  ఫొటోలు వైరల్..!
ఈ ఫొటో జో బిడెన్ ను ఉద్దేశించి తీసింది కాదని వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

చొక్కాలేకుండా బీచ్ లో ఫోజులిచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్. 80 ఏళ్ల యూఎస్ ప్రెసిడెంట్ తన రెహోబోత్, డెలావెర్ ఇంటికి సమీపంలోని బీచ్ లో చొక్కాలేకుండా సన్ బాత్ ను ఆస్వాదిస్తున్న ఫొటో సోమవారం సోషల్ మీడియాను హల్ చల్ చేశాయి. గతంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చొక్కాలేకుండా గుర్రపు స్వారీ చేయగా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను మరింత బలంగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో భాగంగా ఆయన అభిమానులు కండలు తిరిగిన సిల్వెస్టర్ స్టాలోన్ బాడీకి ట్రంప్ ఫొటోను అతికించి వైరల్ చేశారు. పలువురు దేశాధినేతలు తమ శక్తిని, ఫిట్ నెస్ ను ప్రదర్శించడానికి పలు రకాల పనులను చేస్తుంటారని సైకాలజిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే భారత ప్రధాని గతంలో వైల్డ్ లైఫ్ లో సంచరించారని అభిప్రాయపడ్డారు.






అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం తన బాడీని ప్రదర్శించాలని అనుకోలేదని తెలుస్తోంది. 80 ఏళ్ల బిడెన్ సన్ బాత్ ను ఆస్వాదిస్తున్న ఫొటోను ఎరిక్ గెల్లర్ అనే జర్నలిస్ట్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటో క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ ఫొటోలో బిడెన్ నీలిరంగు స్మిమ్మింగ్ ట్రంక్ వేసుకుని, నీలిరంగు టెన్నిస్ షూలు, బ్యాక్ వర్డ్స్ బేస్ బాల్ క్యాప్, సన్ గ్లాసెస్ వేసుకుని ఉన్నారు. మరే విధమైన దుస్తులను ఆయన ధరించలేదు. "ప్రెసిడెంట్ బిడెన్ రెహోబోత్‌లో అందమైన బీచ్ డేని ఆస్వాదిస్తున్నారు" అని జర్నలిస్ట్, ఎరిక్ గెల్లర్ ట్వీట్ చేశారు.




నిజానికి ఈ ఫొటో జో బిడెన్ ను ఉద్దేశించి తీసింది కాదని వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. యూఎస్ ప్రథమ మహిళ జిల్ బిడెన్ గొడుగు కింద కూర్చున్న ఫొటోను తీయడానికి అనుమతివ్వగా.. ఆ ఫొటోలో ఆవిడ వెనక బోబిడెన్ మరోకరితో మాట్లాడుతూ కనిపించారు. అధ్యక్షుడి రక్షణ సిబ్బంది మరో మూడు ఫొటోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు ఉన్న అధ్యక్షుడిగా జో బిడెన్ ఉన్నారు. 2024లో రెండవ సారి అధ్యక్షుడిగా గెలవాలని ఇప్పటికే ఆయన ప్రయత్నాలు ఆరంభించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story