America : అమెరికాలో బ్యాలెట్ బాక్స్ ఫైర్.. విచారణలో పాల్గొన్న ఎఫ్‌బీఐ

అధ్యక్ష ఎన్నికల ముందు ఘటన

అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌ బరిలో ఉన్నారు. ఈనేపథ్యంలో వాషింగ్టన్‌, ఒరెగాన్‌లో దారుణం చోటుచేసుకొంది. ఆ ప్రాంతాల్లోని బ్యాలెట్‌ బాక్సులకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు.

ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో మంటలు చెలరేగి మూడు బ్యాలెట్‌ బాక్సులు దెబ్బతిన్నాయి. వాషింగ్టన్‌లోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇక్కడి బ్యాలెట్‌ బాక్సులకు ఎటువంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఇది ఉద్దేపూర్వకంగా జరిగిన ఘటనగా పోర్ట్‌ల్యాండ్ పోలీస్‌ అధికారి తెలిపారు. మండే స్వభావం కలిగిన పదార్థాలను బ్యాలెట్‌ బాక్సుల కింద అమర్చడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈనేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత పీడీటీలో ఓటు వేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారులను సంప్రదించాలని స్థానిక అధికారులు వెల్లడించారు. మరోవైపు ఫినిక్స్‌లో గురువారం నాడు మెయిల్‌బాక్స్‌కు నిప్పంటించిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 20 బ్యాలెట్‌ బాక్సులు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.


Tags

Next Story