Israel Embassy: ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం..

ఇజ్రాయిల్‌పై అటాక్‌కు ఇరాన్ రెఢీ..

హ‌మాస్ రాజ‌కీయ‌వేత్త ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య నేప‌థ్యంలో.. ఇజ్రాయిల్‌పై దాడికి ఇరాన్ సిద్ద‌మ‌వుతున్న‌ది. ఈ వారాంతంలో భారీ అటాక్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ధ్య‌ప్రాశ్చ్య ప్రాంతంలో యుద్ధ నౌక‌ల‌ను అమెరికా మోహ‌రిస్తున్న‌ది. టెహ్రాన్ చేప‌ట్టే దాడుల‌ను తిప్పికొట్టేందుకు అమెరికా ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ‌నౌక‌లు, ఫైట‌ర్ జెట్స్‌ను అమెరికా మోహ‌రిస్తున్న‌ది. అమెరికా సిబ్బందిని, ఇజ్రాయిల్‌ను డిఫెండ్ చేయాల‌న్న ఉద్దేశంతో పెంటగాన్ ఈ చ‌ర్య‌ల‌కు దిగింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్రూయిజ‌ర్లు, డెస్ట్రాయ‌ర్లను కూడా అమెరికా మోహ‌రిస్తున్న‌ట్లు పెంట‌గాన్ అధికారులు చెప్పారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య జరిగింది. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణస్వీకారం కోసం ఇరాన్ వచ్చిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం ఇరాన్‌ని తలదించుకునేలా చేసింది. ఈ హత్యకు ఇజ్రాయిల్ కారణమని ఇరాన్‌తో పాటు దాని ప్రాక్సీలు హమాస్, హిజ్బుల్లాలు ఆరోపించాయి. అయితే, ఈ దాడిపై ఇజ్రాయిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీనికి తప్పకుండా ప్రతీకారం ఉంటుందని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిడిల్‌ఈస్ట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రపంచం ఆందోళన చెందుతోంది.

టెల్ అవివ్‌లో ఉన్న ఇండియ‌న్ ఎంబ‌సీ శుక్ర‌వారం ఓ అడ్వైజ‌రీ రిలీజ్ చేసింది. భార‌తీయులంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. సేఫ్టీ ప్రోటోకాల్స్‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని పేర్కొన్న‌ది. ఎంబ‌సీకి చెందిన సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో అడ్వైజ‌రీ పోస్టు చేశారు. ఇజ్రాయిల్‌, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న జారీ చేశారు. ఇద్ద‌రు సీనియ‌ర్ హ‌మాస్ నేత‌ల‌తో పాటు హిజ్‌బుల్లా క‌మాండ‌ర్‌ను కూడా చంపిన ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌తీయ ఎంబ‌సీ ఈ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. టెలిఫోన్ నెంబ‌ర్ల‌ను కూడా రిలీజ్ చేశారు.

గత మూడేళ్లలో, దేశ రాజధానిలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో రెండు తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరిగాయి. రెండు దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు.గత ఏడాది ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం మొదలవ్వడంతో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను పెంచారు.

Tags

Next Story