అంతర్జాతీయం

లేటెస్ట్ టెక్నాలజీతో మాస్క్.. రేపే మార్కెట్లోకి..

అమెరికన్ రాపర్ విలియం ఆడమ్స్, లేటెస్ట్ టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఫేస్ మాస్క్‌ను ఆవిష్కరించారు.

లేటెస్ట్ టెక్నాలజీతో మాస్క్.. రేపే మార్కెట్లోకి..
X

కరోనా పుణ్యమా అని మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో వివిధ రకాల మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా విల్.ఐ.ఎమ్ అని పిలువబడే అమెరికన్ రాపర్ విలియం ఆడమ్స్, లేటెస్ట్ టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఫేస్ మాస్క్‌ను ఆవిష్కరించారు.

ఇందులో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, మైక్రోఫోన్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఉంటుంది. అలాగే త్రీ స్పీడ్ డ్యూయల్ ఫ్యాన్స్, వెంటిలేషన్, హెపా (హెచ్ఈపీఏ) ఫిల్టర్స్, ఒక్క సారి చార్జి చేస్తే సుమారు 7 గంటల పాటు పని చేసే బ్యాటరీ వంటి సదుపాయాలన్నీ ఈ మాస్క్‌లో ఉన్నాయి.

హనీవెల్ కంపెనీతో కలిసి "జుపెర్‌మాస్క్" పేరిట గురువారం ఈ మాస్క్‌ను మార్కెట్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రెండు వేరియంట్లలో ఈ మాస్క్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఇంతకూ ఈ మాస్క్ ధర ఎంతనుకుంటున్నారు 299 డాలర్లు.. అదే మన ఇండియన్ కరెన్సీలో అయితే రూ.22 వేలు.

Next Story

RELATED STORIES