అమెరికాను వణికిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజులోనే

అమెరికాను వణికిస్తున్న మహమ్మారి.. ఒక్కరోజులోనే
Covid cases in USA: అగ్రదేశం అమెరికాను కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. గత ఏడాది విజృభించి వేలాది ప్రాణాలను బలిగొన్న వైరస్‌..

అగ్రదేశం అమెరికాను కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. గత ఏడాది విజృభించి వేలాది ప్రాణాలను బలిగొన్న వైరస్‌.. ఇప్పుడు చాపకిందనీరులా విస్తరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వైరస్ పేరు వింటేనే జనం గుండె ఆగినంతపనైపోతోంది. అలాంటిది ఒక్క రోజులోనే లక్షకు పైగా కేసులు నమోదు కావడం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ దేశాల్లోనే అమెరికాలో అత్యధిక కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది.

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. సెకండ్‌వేవ్ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో ఈ మహమ్మారి మళ్లీ పడగ విప్పుతోంది. ఒక్కరోజులోనే లక్షకు పైగా కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురిచేస్తోంది. 24గంటల వ్యవధిలో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి,. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.. గత కొద్దిరోజుల నుంచి కొవిడ్‌ కేసుల్లో అత్యధిక పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో వస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండటం తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్కరోజే అమెరికాలో 1లక్ష 49వేల 788 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. అలాగే, తాజాగా 668 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కొవిడ్‌ కాటుకు బలైపోయినవారి సంఖ్య 6.14లక్షలకు చేరింది.

అయితే అగ్రదేశం అమెరికాలో చాలా ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డెల్టా వేరియంట్ వ్యాపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుదలతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత జోరందుకోనుంది. గడిచిన 10 రోజుల వ్యవధిలోనే 30లక్షల మందికి టీకా ఇచ్చినట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 18 ఏళ్లు పైబడిన 70శాతం మందికి కనీసం ఒక్కడోసు అందించారు. అలాగే, ఇప్పటివరకు ఒక్కడోసు కూడా పూర్తికాని దాదాపు 9కోట్లమందికి త్వరలోనే వ్యాక్సిన్‌ వేయించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story