అమెరికాలో మళ్ళీ పడగ విప్పిన కరోనా.. ఒక్కరోజులోనే వెయ్యికి పైగా మరణాలు..!

అమెరికాలో మళ్ళీ పడగ విప్పిన కరోనా.. ఒక్కరోజులోనే వెయ్యికి పైగా మరణాలు..!
అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ కరోనా మళ్ళీ పడగ విప్పుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ కరోనా మళ్ళీ పడగ విప్పుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు అయితే రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే ఏకంగా వెయ్యికి పైగా(1017) మరణాలు సంభవించాయి. అంటే దాదాపుగా గంటకి 42 మంది కరోనాతో మృతి చెందుతున్నారు. తాజా మరణాలతో కలిపి అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 6,23,000లకు చేరింది. అయితే ఇన్ని మరణాలు మరే దేశంలో కూడా సంభవించలేదు. చివరిసారిగా యునైటెడ్ స్టేట్స్ లో రోజువారీగా 1,000 కంటే ఎక్కువ మరణాలు మార్చి నెలలో నమోదు అయ్యాయి. ఇక అటు గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

Tags

Next Story