Pig Kidney: మనిషికి పంది కిడ్నీ.. ప్రయోగం సక్సెస్..!

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పందికిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రయోగం నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. పంది మూత్రపిండం గతంలో కంటే ఎక్కువగా 2నెలలపాటు సాధారణంగా పనిచేసి చరిత్ర సృష్టించింది. దీంతో మానవులకు అవయవాల కొరతను అధిగమించడానికి చేస్తున్న ప్రయోగాల్లో వైద్యులు పురోగతి సాధించారు
అమెరికాలో 2నెలలక్రితం బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పందికిడ్నీని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ప్రయోగాన్ని న్యూయార్క్ విశ్వవిద్యాలయం వైద్యులు ముగించారు. పందికిడ్నీని తొలగించి వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరాన్ని అంత్యక్రియల కోసం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. చనిపోయిన వ్యక్తిలో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన పంది మూత్రపిండం గతంలో కంటే ఎక్కువ రోజులు పనిచేయటం ఇదే మొదటిసారి. చనిపోయిన వ్యక్తిపై జరిపిన ఈ పరిశోధన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్న వైద్యులు త్వరలో జీవించి ఉన్నవారిలోను పంది మూత్రపిండాలను ట్రాన్స్‌ప్లాంటు చేయాలనే ఆశతో ఆ వివరాలు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
జినో ట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలిచే ఈ ప్రయోగం కొన్నిదశాబ్దాలపాటు విఫలమైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ వెంటనే జంతువుల కణజాలాన్ని వెంటనే నాశనం చేసేది. పందులను జన్యు మార్పిడి చేయటంవల్ల వాటి అవయవాలు మానవుల మాదిరిగానే ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది సాధ్యమేనని తాము తెలుసుకున్నట్లు న్యూయార్క్ వర్సిటీకి చెందిన వైద్యులు తెలిపారు.
మిల్లర్ అనే ఓ వ్యక్తి వైద్యులు బ్రెయిన్‌డెడ్ అని ప్రకటించారు. మృతుడు క్యాన్సర్ రోగి కావటంతో ఆయన్ని అవయవాలు దానంచేయలేకపోయారు. కానీ పంది అవయవాల ట్సాన్స్ ప్లాంటేషన్ కోసం మిల్లర్ శరీరాన్ని అతని కుటుంబసభ్యులు దానం చేశారు. జులై 14న మిల్లర్ మూత్రపిండాల స్థానంలో పంది మూత్రపిండాలు, రోగనిరోధక కణాలకు శిక్షణ ఇచ్చే గ్రంధీని ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. మొదటినెల పంది మూత్రపిండం ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేసింది. రెండోనెల మూత్రం తయారీలో కొంత తగ్గుదలను వైద్యులు గుర్తించారు. రోగనిరోధక వ్యవస్థ తిరస్కరణ మొదలైనట్లు....బయాప్సీలో వెల్లడైంది. ఇది చికిత్స చేయదగినదో కాదో తేల్చేందుక .వైద్యులకు అవకాశం లభించింది. రోగులు ఉపయోగించే ప్రామాణిక రోగ నిరోధకత- అణచివేసే మందుల మార్పుతో మూత్రపిండాల పనితీరు తిరిగి పుంజుకుంది. న్యూయార్క్ వర్సిటీ బృందం FDA ఇతర ప్రశ్నలను పరిశీలించింది. మానవ హార్మోన్లు, విసర్జించిన యాంటీబయాటిక్స్ లేదా ఔషధ సంబంధిత దుష్ప్రభావాలకు పంది మూత్రపిండం ఎలా స్పందించిందనే విషయంలో తేడాలు లేవని గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com