US Tech Companies: యూఎస్ టెక్ కంపెనీల్లో భారీ తొలగింపులు.. ఎక్కువగా ఎఫెక్ట్ అయింది తెలుగువారే

US Tech Companies: యూఎస్ టెక్ కంపెనీల్లో భారీ తొలగింపులు.. ఎక్కువగా ఎఫెక్ట్ అయింది తెలుగువారే
US Tech Companies: టెక్ కంపెనీల భారీ తొలగింపుల కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లోని పలువురు టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు.

US Tech Companies: టెక్ కంపెనీల భారీ తొలగింపుల కారణంగా యునైటెడ్ స్టేట్స్‌లోని పలువురు టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తొలగింపులను ప్రకటించాయి. ఇందులో భాగంగా వేలాది మంది భారతీయ ఐటి నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.



యుఎస్‌లోని మొత్తం ఉద్యోగుల తొలగింపులో, దాదాపు 40 శాతం మంది భారతీయ ఐటి నిపుణులు ఉండగా అందులో ఎక్కువ మంది తెలుగువారే ఉన్నారు. వర్క్ వీసాపై అమెరికాలో పని చేస్తున్న టెక్కీలు కొత్త ఉపాధిని వెతుక్కుంటూ ఇబ్బంది పడుతున్నారు. తొలగించబడిన అనేక మంది ఐటీ ఉద్యోగులు సమాచారాన్ని పంచుకోవడానికి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు.



వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన నివేదిక ప్రకారం, గత ఏడాది నవంబర్ నుండి దాదాపు 2,00,000 మంది ఐటీ ఉద్యోగులను తొలగించారు. అమెజాన్‌లో పనిచేసే ఓ ఉద్యోగి మూడు నెలల క్రితమే USకి వచ్చారు. ఈ వారం మార్చి 20 తన లాస్ట్ వర్కింగ్ డే అని ఆమెకు మేనేజ్‌మెంట్ మెయిల్ పెట్టింది. ఆమె H-1B వీసాలో ఉంది. ఆమె 60 రోజులలోపు కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. లేదంటే ఆమె భారతదేశానికి తిరిగి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు.



మరొక మహిళ జనవరి 18న Microsoft నుండి తొలగించబడింది. ఆమె ఒంటరి తల్లి. ఆమె కొడుకు కాలేజీలో చేరడానికి సిద్ధమవుతున్నాడు." ఈ పరిస్థితి మాకు చాలా కష్టంగా ఉంది," ఆమె చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో, అన్ని IT కంపెనీలు తక్కువ వ్యవధిలో ఉద్యోగం పొందడం అసాధ్యమని భావిస్తున్నారు. కాబట్టి, కొత్త ఉద్యోగం పొందడానికి తొలగించబడిన నిపుణుల మధ్య గట్టి పోటీ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story