US Woman: బామ్మ @ 98.. ఆరు తరాలను చూసింది..

US Woman: ఈ వయసులో కూడా బామ్మ ఎంత అందంగా ఉంది. ఈ మధ్య తన ఏడు వారాల మునిమనవడిని పట్టుకుని సంబర పడుతోంది. ఇప్పటికే ఆమెకు 106 మంది మనవరాళ్ళు, 222 మంది మనవరాళ్ళు, 234 మునిమనవరాళ్ళు మరియు 37 మునిమనవరాళ్ళు ఉన్నారు. వీరంతా US లో నివసిస్తున్నారు. అమెరికాలోని కెంటకీకి చెందిన 98 ఏళ్ల మేడెల్ 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అప్పటికే పెళ్లై 10 మంది పిల్లలున్న 50 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లైన తరువాత ఆమెకు మరో ముగ్గురు పిల్లలు పుట్టారు. మొత్తం 13 మంది సంతానం. దాంతో వాళ్లందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరికీ పిల్లలు, పిల్లలకు మళ్లీ పిల్లలు. ఆమె మనవరాలు గ్రేసీ చెప్పినట్లుగా ఆమె ఆధునిక సౌకర్యాలు ఏవీ ఉపయోగించుకోలేదు.. చాలా సాధారణ జీవితాన్ని గడిపింది. వాషర్ డ్రైయర్ లేదు, డిష్‌వాషర్ లేదు, రన్నింగ్ వాటర్ లేదు. ఆమె చాలా కష్టాలు పడింది. ఆమె తన జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించింది. ఆమె అంటే కుటుంబసభ్యులందరికీ చాలా ఇష్టం. అందరికీ తన ప్రేమను పంచింది. మనవళ్లనీ, మనవరాళ్లని ఎంతో ముద్దు చేస్తుంది. అని గ్రేసీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com