17 March 2023 8:10 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / USA : మహిళను చంపి, ఆమె...

USA : మహిళను చంపి, ఆమె గుండెతో వంట చేసి..!

జైలు నుంచి విడుదలైన రెండు వారాల్లోనే ఓ మహిళను చంపి ఆమె కుటుంబసభ్యులకు తినిపించి....

USA : మహిళను చంపి, ఆమె గుండెతో వంట చేసి..!
X

ఓ మహిళను చంపి, ఆమె గుండెతో కూర వండి ఆమె కుటుంబసభ్యులతోనే తినిపించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికాలోని ఓక్లహోమ్ లో జరిగింది. 44ఏళ్ల లారెన్స్ అండర్ పాల్ కు గతంలో నేరచరిత్ర ఉంది. 2021లో భయంకరమైన హత్యలకు పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఆ హత్యల నేపథ్యంలో అతను జైలు జీవితం గడుపుతున్నాడు. ముందస్తుగా రిలీజ్ అయిన అతను నెలలోపే నాలుగు హత్యలు చేశాడు.

విడుదలైన రెండు వారాల తర్వాల ఆండ్రియా బ్లాంకెన్షిప్ అనే మహిళను చంపి ఆమె గుండెను తీసుకుని అతని అత్తామామ నివసిస్తున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ గుండెను వండి అత్తా మామలకు, వారితో ఉంటున్న నాలుగేళ్ల చిన్నారికి తినిపించాడు. ఆర్వాత అతని అత్తామామలను, నాలుగేళ్ల చిన్నారిని హత్య చేశాడు.

లారెన్స్ అండర్సన్ మారకద్రవ్వాల కేసులో 20 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తుండగా.. ముందస్తుగా విడుదల అయ్యాడని పోలీసులు తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత అతని సొంత కుటుంబాన్నే హత్యచేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం నిందితుడికి ఐదుసార్లు జీవిత ఖైదు విధిస్తున్నట్లు తీర్పును వెలువరించింది. అండర్సన్ జీవితం మొత్తం జైలులోనే గడపాల్సిఉంది.

Next Story