USA : క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు

USA : క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు
X

అగ్రరాజ్యం చరిత్రలో సంచలనం చోటుచేసుకుంది. పోర్న్‌స్టార్‌కు డబ్బు చెల్లింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోర్టుకు హాజ రయ్యారు. క్రిమినల్ ఛార్జ్‌లను ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. మొదట న్యూయార్క్‌ పోలీసులు ట్రంప్‌ను అదుపులోకి తీసుకుని మన్ ‌హటన్‌ కోర్టులో హాజరుపరిచారు. ట్రంప్‌పై పలు అభియోగాలు మోపారు. విచారణ అనంతరం ట్రంప్‌ కోర్టు నుంచి వెళ్లిపోయారు.

2006లో ట్రాంప్‌ తాను ఓ కార్యక్రమంలో కలుసుకున్నామని పోర్న్‌ స్టార్‌ స్టార్మీ డేనియల్స్‌ ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండేందుకు 2016 అమెరికా ఎన్నికల ముందు ట్రంప్‌ న్యాయవాది మైఖేల్‌ కోహెన్‌ తనకు డబ్బు ముట్ట జెప్పారంది. అయితే ఇది నిజమేనని ట్రంప్‌ న్యాయవాది కోహెన్‌ ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్‌ అభియోగం మోపాలని మన్‌హటన్‌ గ్రాండ్‌ జ్యూరీ నిర్ణయించింది.

ట్రంప్‌పై నేరాభియోగాల నమోదు సందర్భంగా న్యూయార్క్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. మన్‌హటన్‌లో భారీ భదత్రను ఏర్పాటు చేశారు. కీలక ప్రదేశాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనేక వీధులను మూసివేశారు. రిపబ్లికన్‌ సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌నకు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో రిపబ్లికన్లు ర్యాలీలు నిర్వహించారు.

Next Story