USA : టిక్ టాక్ చాలెంజ్ కు మైనర్ బలి... 80శాతంపైగా కాలిన గాయాలు

టిక్ టాక్ చాలెంజ్ కు ఓ మైనర్ బాలుడు బలయ్యాడు. వీడియో చేస్తూ అగ్నిప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతనికి 80శాతం పైగా కాలినగాయాలయ్యాయి. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఈ ఘటన జరిగింది. మాసన్ డార్క్ ( 16) అనే బాలుడు వేక్ ఫారెస్ట్ లో స్ప్రే పెయింట్ డబ్బాతో అగ్నిని రాజేయగా ఒక్కసారిగా పెద్దగా మండింది. దీంతో అతను మంటలో తీవ్రంగా గాయపడ్డాడు. మంటల ధాటికి తట్టుకోలేక పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. అప్పటికే అతను 80శాతం గాయాలతో గుర్తుపట్టలేకుండా అయ్యాడు. హుటాహుటిన అతన్ని NC బర్న్ సెంటర్ కు తరలించారు. మంటలు అంటుకున్న తర్వాత చెరువులో దూకడం వలన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
మసన్ కోలుకోవడానికి ఆర్థికసహాయం చేయాలని ఆతని తల్లి కోరింది. ''నా కొడుకు మాసన్ కు మీ ప్రార్థనలు కావాలి. అతని శరీరం 75% కాలిపోయింది. ఏప్రిల్ 23, 2023 ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. మంటలను ఆర్పడానికి అతను నదిలోకి దూకాడు. చాపెల్ హిల్‌లోని UNC బర్న్ సెంటర్‌లో ఉన్నందుకు మేము కృతజ్ఞులం. కాలిన గాయాలను నయం చేయడంలో ఈ సెంటర్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. దయచేసి మాసన్ కోలుకోవాలని ప్రార్థించండి. అతను నమ్మశక్యం కాని నొప్పితో ఉన్నాడు. మీకు తోచిన సహాయాన్ని చేయండి" అని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com