USA: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు 9మంది జవాన్లు మృతి

X
By - Subba Reddy |31 March 2023 9:00 AM IST
శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించిన లెఫ్టినెంట్ కర్నల్
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. యూఎస్ ఆర్మీకి చెందిన రెండు బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు ఫోర్ట్ క్యాంప్‌బెల్ ప్రాంతంలో కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మృతిచెందారు. శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని లెఫ్టినెంట్ కర్నల్ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘ టనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com