సభలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తి నేనే : ట్రంప్‌

సభలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తి నేనే : ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న అభ్యర్థుల మూడో డిబేట్‌.. ఆసక్తికర చర్చకు దారితీసింది. ట్రంప్‌, జో బైడెన్‌ జాత్యాహంకారం అంశంపై డిస్కస్‌ చేశారు. సభలో అత్యంత తక్కువ జాత్యాహంకారం ఉన్న వ్యక్తి తానేనని... నల్ల జాతీయులకు తాను చేసినంత సేవ ఇంతవరకు ఏ అధ్యక్షుడూ చేయలేదని ట్రంప్‌ అన్నారు. అప్పట్లో అబ్రహాం లింకన్ నల్లజాతీయుల ఉన్నతికి దోహదం చేశారని.... ఆయన తర్వాత వారి అభ్యున్నతికి తానే ఎక్కువ కృషి చేశానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఓ నల్లజాతీయురాలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ కామెంట్స్‌పై జో బైడెన్ వెరైటీగా స్పందించారు. తనను తాను దివంగత మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌తో ట్రంప్ పోల్చుకోవడంపై వ్యంగాస్త్రాలు సంధించారు. అత్యంత ప్రమాదకర జాత్యాహంకారిగా అబ్రహాం లింకన్‌ను ఆధునిక అమెరికా సమాజం చూస్తోందని.. ప్రతి అమెరికన్ పౌరుడిలో జాత్యాహంకార భావాలు ఆయన రెచ్చగొట్టారని అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలకు ట్రంప్ వెంటనే స్పందించారు. అబ్రహాం లింకన్ జాత్యాహంకారి అనడానికి మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా..? ఇందుకు మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు. బైడెన్ చాలా కూల్‌గా 'నేను ఆధునిక అబ్రహం లింకన్‌ను అని నువ్వే కదా చెప్పుకున్నావు..' అంటూ ట్రంప్‌పై వ్యంగాస్త్రం సంధించారు.

అటు.. అమెరికా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కరోనాను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని, చైనాకు రాకపోకలు నిషేధించడంపై ట్రంప్ ఆలస్యంగా స్పందించారని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story