US Speaker: చరిత్రలో తొలిసారి స్పీకర్‌కు ఉద్వాసన

అగ్రరాజ్యం చరిత్రలో మొట్టమొదటి సారిగా స్పీకర్‌ను పదవి నుంచి తొలగించారు. కెవిన్‌కు వ్యతిరేకంగా రిపబ్లికన్ పార్టీ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాస తీర్మానం తీసుకురాగా.. దీనిపై ఓటింగ్ చేపట్టి మెకార్థీని తొలగించారు. సుదీర్ఘ ఓటింగ్ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే మెకార్థీ స్పీకర్ పదవి చేపట్టగా.. 10 నెలలు తిరగకుండానే ఆయన ఉద్వాసనకు గురవ్వడం గమనార్హం. ఇలా ఓ స్పీకర్‌ను బలవంతంగా పదవీచ్యుతుడిని చేయడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి. సుదీర్ఘ ఓటింగ్ తర్వాత ఈ ఏడాది జనవరిలో స్పీకర్ పదవి చేపట్టిన మెకార్థీ... పట్టుమని పది నెలల కూడా తిరక్కుండానే ఉద్వాసనకు గురికావడం గమనార్హం.
గతేడాది జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో సెనేట్‌ను అధికార డెమొక్రాట్లు కైవసం చేసుకోగా.. ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్లు పట్టు సాధించారు. దిగువసభలోని మొత్తం 435 సీట్లలో డెమొక్రాట్లు 213.. రిపబ్లికన్లు 222 సీట్లను గెలిచి మెజారిటీ దక్కించుకున్నారు. అయినప్పటికీ స్పీకర్‌ను ఎన్నుకునే విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. మొత్తానికి నాలుగు రోజుల పాటు ఏకంగా 15 దఫాలు ఓటింగ్ నిర్వహించగా.. చివరకు కెవిన్ మెకార్థీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
అప్పుడు పదవిని చేజిక్కించుకోవడం కోసం పార్టీ నేతలతో మెకార్దీ ఓ ఒప్పందం చేసుకున్నారు. తన తొలగింపునకు ఒక్క రిపబ్లికన్ సభ్యుడు డిమాండ్ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమ్మతిస్తానన్న చెప్పారు. ప్రస్తుతం ఆ ఒప్పందాన్ని ఆయుధంగా మార్చుకుని మెకార్థీపై రిపబ్లికన్ నేత మ్యాట్ గేజ్ అవిశ్వాసం తీసుకొచ్చారు. నిజానికి స్పీకర్ పదవి చేపట్టిన తర్వాత మెకార్దీకి దినదిన గండంగానే సాగింది. పలుమార్లు వ్యతిరేకత ఎదుర్కొన్న ఆయన... హామీలను నిలబెట్టుకోలేదన్న ఫిర్యాదులూ వచ్చాయి. ఈ క్రమంలోనే గతవారం ఫెడరల్ ప్రభుత్వాన్ని షట్‌డౌన్ ముప్పు నుంచి తప్పించేందుకు ఆయన తీసుకున్న చర్యలు ఇరుకునపెట్టాయి. 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందిలేకుండా చేసే స్వల్పకాలిక బిల్లులను ప్రతినిధుల సభలో గతవారం ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించడంతో స్పీకర్ మెకార్దీ చొరవ చూపారు. దేశ ప్రజల ఇబ్బందులను నివారించే ఈ బిల్లులను ఆమోదించాలని సభ్యులను కోరారు.
దీంతో స్పీకర్ మాటను గౌరవించి రిపబ్లికన్లు బిల్లుకు ఆమోదం తెలిపారు. అయితే, ఈ పరిణామంతో మెకార్థీపై సొంతపార్టీలో వ్యతిరేకత మరింత పెరిగింది. పదవిని కాపాడుకునేందుకు ఆయన డెమొక్రాట్లతో చేతులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఆయనపై రిపబ్లికన్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com