Guinness Record : పొడవైన గడ్డంతో ఆమెకు గిన్నిస్ రికార్డు

మగవాళ్లు గడ్డం పెంచడం చాలా కామన్. కానీ ఆడవాళ్లకి అలా జరగడం హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్.. నిజానికి మొఖం మీద ఒక వెంట్రుక వస్తేనే ఆడవాళ్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దానిని ఎలా తీసేద్దామా దానితో బయటకి వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఏమనుకుంటారో అని మనసుని నలిగిపోతుంది. పాపం అమెరికాకు చెందిన 38 ఏళ్ల ఎరిన్ హానీకట్ అనే మహిళ కూడా చాలా కాలం అలానే ఇబ్బంది పడింది. కానీ తరువాత తన ఆరోగ్యం కంటే ఎదుటి వాళ్ళు మాటలు ముఖ్యం కాదని నిర్ణయించుకొని ఆ గడ్డాన్ని అలాగే వదిలేసింది.. ఇప్పుడుఅరుదైన రికార్డు అందుకుంది. వివరాల్లోకి వెళితే ..
ఎరిన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఆమేకు 11.8 ఇంచుల పొడవైన గడ్డం ఉన్నట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారులు ధ్రువీకరించారు.
ఎరిన్ పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్(పీసీఓఎస్) బాధితురాలు. దీని బారినపడిన వారికి హార్మోనల్ బ్యాలెన్స్ పూర్తిగా పోతుంది. శరీరంపై అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. ఎరిన్‌కు 13 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకు ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమయ్యింది. చాలా ఇబ్బంది పడిన ఆమె వివిధ పద్దతుల్లో వాటిని తొలగించేది. మరోవైపు హైబ్లడ్ ప్రజర్ కారణంగా ఆమెకు చూపు మందగించింది. చాలా కాలం పాటు ఆమె మానసికంగా నరకం అనుభవించారు. రోజురోజుకూ కుంగిపోయి మానసిక పరిస్థితి క్షీణించుకుపోవడంతో.. ఆమె స్నేహితులు, బంధువులు గడ్డం ఉంటే తప్పేంటని అన్నారు. ఇలా ఇంకా అందంగా ఉన్నావంటూ ప్రోత్సహించే వారు. ఇక అప్పటి నుంచి అందం కోసం, వెంట్రుకలకోసం తాపత్రయ పడటం, అవి ఇవి వాడి వాటిని తొలగించడం మానేసింది.
ఇలా ఎరిన్ హనీకట్ గడ్డం 30 సెంటీమీటర్ల పొడవు అంటే 11.81 ఇంచీలు పెరిగింది. ఒక మహిళకు ఇంత పొడవాటి గడ్డం ఉండటం అనే అంశంపై ఆమె గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది. ఈమెకు ముందు అమెరికాకు చెందిన 75 ఏళ్ల మహిళ వివియన్ హీలర్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆమెకు 25.5 సెంటీమీటర్ల గడ్డం ఉంది. నిజానికి ఫిబ్రవరి 8నే ఆమె పొడవైన గడ్డం కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డు నెలకొల్పినట్లు అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. రెండు రోజుల క్రితమే అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. ఈ రికార్డు గురించి ఎరిన్ మాట్లాడుతూ తాను గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంటానని ఎన్నడూ అనుకోలేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com