Venice: ఫ్లోటింగ్ సిటీలో లోఫర్ వేషాలు...

Venice: ఫ్లోటింగ్ సిటీలో లోఫర్ వేషాలు...
బిల్డింగ్ పై నుంచి కెనాల్ లోకి దూకిన గుర్తుతెలియని వ్యక్తి, ఆ ఇడియట్ ను పట్టుకోండి అంటూ మేయర్ ఆదేశాలు జారీ....

అలలపై తేలియాడే నగరంగా పేరుగాంచిన వెనీస్ ఓ భూతల స్వర్గమని ప్రకృతి ప్రేమికులు కొనియాడుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి సేదతీరాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి ప్రశాంతమైన నగరంలో సాహసయాత్రలు చేపట్టాలని, ఒళ్లు గగుర్పొడిచే విన్యాశాలు చేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు. కానీ, ఇన్స్టాలో రీల్స్ కోసం ఎంతకైనా తెగించేలా మారిపోతున్నవారికి అలాంటి ఆలోచన రావడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఇదే విధంగా ఓ మూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి ఓ కెనాల్ లోకి దూకి తన సరదా తీర్చుకున్నాడు ఓ వ్యక్తి. ఒంటిపై కేవలం నిక్కరుతో కెనాల్ లోకి దూకి, తీరిగ్గా ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ఈ తతంగాన్నంతా రికార్డ్ చేస్తున్న ఫ్రెండ్ అతిడికి తువ్వాలు అందించాడు. ఇక ఈ వ్యవహారాన్నంతా మరొకరు వీడియో తీయడంతో ఈ మ్యాటర్ ను వెనీస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నగర మేయర్ సదురు వీడియోను ట్వీట్ చేస్తూ నాలుగు వ్యూస్ జనాలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఎంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందో ఇలాంటి వారికి అర్ధంకాదు. అటువైపుగా ఏదైనా బోట్ వస్తే పరిస్థితి మరోలా ఉండేది ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీడియోలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story