Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కొత్త లుక్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తన ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు ఆయన వచ్చారు. తన సాధారణ హెయిల్‌ైస్టెల్‌కు భిన్నమైన కొత్త హెయిర్‌ైస్టెల్‌తో ట్రంప్ కనిపించారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కొత్త హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్రంప్ గతంలో కంటే చాలా డిఫరెంట్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఫ్లోరిడాలోని ట్రంప్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ ‘ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్’ నుంచి వచ్చింది. ఆయనను మద్దతుదారులు సాదర స్వాగతం పలికారు. ట్రంప్ హృదయపూర్వకంగా ప్రతిస్పందించడం వీడియోలో కనిపిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు స్పందించారు. కాగా.. తాజాగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ 2025 జనవరి 20న అధికారికంగా బాధ్యతలు చేపడతారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. 270 మ్యాజిక్ ఫిగర్ ఉండగా.. ఇప్పటి వరకూ ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. ఇక విస్కాన్సిన్‌లో ట్రంప్ గెలుపొందారు. తాజా ఫలితాలను చూస్తుంటే అమెరికన్లు ఏకపక్షంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ను గెలిపించాలన్న ఉద్దేశంతోనే అమెరికన్లు ఏకపక్షంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా ట్రంప్ భారీ విజయం దిశగా దూసుకెళ్లారు. ఇక రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడంపై ప్రపంచ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో అధ్యక్షుడిగా గెలవాలంటే 270 ఓట్లు సాధించాలి. కానీ ఆ సంఖ్య దాటేసింది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2017 నుంచి 2021 వరకు అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశారు. 2021 ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవడంతో జో బైడెన్ అధ్యక్షుడయ్యారు. అధ్యక్ష పదవి పోయిన తర్వాత ట్రంప్ ఎన్నో ఆరోపణలు, అవమానాలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ సవాల్ చేసి మరీ గెలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com