Vienna Wooden Chair Cost £16,250: పాత ఫర్నిచర్ పడేస్తున్నారా.. ఈ కుర్చీ విలువ తెలిస్తే..

Vienna Wooden Chair Cost £16,250: పాత ఫర్నిచర్ పడేస్తున్నారా.. ఈ కుర్చీ విలువ తెలిస్తే..
X
Vienna Wooden Chair Cost £16,250 : నిచ్చెన తరహా స్టైల్‌లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీని రూపొందించారాయన.

Vienna Wooden Chair Cost £16,250: పాత ఫర్నిచర్ పడేయకండి.. కోట్లు పెట్టి కొనే మహానుభావులు ఉంటారు.. భద్రంగా ఉంచండి. అవును మరి ఎప్పుడో 120 ఏళ్ల క్రితం కొన్న కుర్చీ అక్షరాలా రూ.16 లక్షల 40 వేల రూపాయలు పలికిందంటే ఆశ్చర్యంగా ఉండదా.

ఈస్ట్ సస్సెక్స్ (యూకే) బ్రిగ్‌టన్‌కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే షాపు నుంచి 5 పౌండ్లు (మన కరెన్సీలో రూ.500లు) పెట్టి కుర్చీ కొనుగోలు చేసింది. అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు.. ఇంటికి దూరపు బంధువు ఒకాయన వచ్చారు..

వచ్చీ రాగానే కుర్చీని ఎగాదిగా చూసి, అది ఎప్పుడు తయారు చేశారో చిటికెలో కనిపెట్టేశాడు.. ఇలాంటి వాటిని వేలంలో పెడితే ఎంతిచ్చైనా కొనడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పాడు.. అవునా.. ఆ విషయం తెలియదు నాకు అని కుర్చీని వేలం పాటలో పెట్టింది.. రూ.500 పెట్టి కొన్నా ఆ కుర్చీ లక్షలు పలకడం చూసి తన అదృష్టానికి తనే విస్తుపోయింది.

20వ శతాబ్ధంలో వియన్నా (ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందినదట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రేలియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్‌లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీని రూపొందించారాయన.

పాత కుర్చీ విలువ తెలిసిన ఆమె ఎస్సెక్స్‌లో స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానికి వేలం వేయగా.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నారు. కుర్చీ తయారు చేసి 120 ఏళ్లు గడిచిన షైనింగ్ ఏ మాత్రం తగ్గకుండా మంచి కండిషన్‌లో ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా.

Tags

Next Story