అప్పుడే పుట్టిన చిన్నారి.. డాక్టర్ మాస్క్ లాగేసి..

అప్పుడే పుట్టిన చిన్నారి.. డాక్టర్ మాస్క్ లాగేసి..
మాస్క్ తీసే రోజులు రాబోతున్నాయనడానికి ఇదే సంకేతం అంటూ డాక్టర్ ఇన్‌స్టా

పుడుతూనే బిడ్డకు భవిష్యత్ గురించి తెలిసిపోయినట్లుంది. మహమ్మారి కరోనాకు భయపడి అందరూ మాస్క్ ధరిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఎందుకు ఈ మాస్క్ అని అన్నట్లే ఉంది ఆ పురిటిబిడ్డ మాస్క్ లాగేస్తున్న తీరు. పుట్టీ పుట్టగానే ఆ చిన్నారి తన చిట్టి చేతులతో సరిగ్గా మాస్క్‌నే పట్టుకుని లాగేయడంతో డాక్టర్ ఆశ్యర్యపోయారు. ఆ దృశ్యాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దాదాపు ఈ ఏడాది అంతా కరోనా జపంతోనే గడిచిపోయింది.

మంచి రోజులు రాబోతున్నాయనేదానికి సంకేతమేమో ఇది అని ఫోటోని చూసి కామెంట్లు చేస్తున్నారు. యూఏఈ గైనకాలజిస్ట్ Dr Samer Cheaid ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ ఫోటోను షేర్ చేశారు. మనమంతా కోరుకుంటున్నట్లు.. త్వరలో ముఖంపై మాస్క్ తీసే రోజులు రాబోతున్నాయనడానికి ఇదే సంకేతం అంటూ డాక్టర్ ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story