Viral Video: హాస్పిటల్‌కి హ్యాట్సాఫ్.. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి వెళుతున్న చిన్నారులను..

Viral Video: హాస్పిటల్‌కి హ్యాట్సాఫ్.. క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కి వెళుతున్న చిన్నారులను..
X
Viral Video: అభం శుభం తెలియని చిన్నారులు.. ఇంకా లోకం చూడనేలేదు.. కానీ వారు కీమో, రేడియేషన్ థెరపీల కోసం హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి.

Viral Video: అభం శుభం తెలియని చిన్నారులు.. ఇంకా లోకం చూడనేలేదు.. కానీ వారు కీమో, రేడియేషన్ థెరపీల కోసం హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా చిన్నారులకు ఈ తరహా చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇంజక్షన్ అంటేనే భయపడిపోయే చిన్నారులకు ఇలాంటి ట్రీట్‌మెంట్ ఎలా చేస్తారు.. అందుకే వారికోసం బొమ్మ కార్లను ఏర్పాటు చేసింది హాస్పిటల్ యాజమాన్యం.

టర్కిష్ హాస్పిటల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలను చికిత్స కోసం తీసుకెళ్లడానికి బొమ్మ కార్లను ఉపయోగించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు చికిత్స గదికి వెళ్లడానికి బెలూన్‌‌లు కట్టిన ఎలక్ట్రిక్ టాయ్ కార్లను నడుపుకుంటూ వెళుతున్నారు. టర్కీ నగరంలోని కైసేరిలోని ఒక ఆసుపత్రిలో, క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు వారి చికిత్స గదికి వెళ్లడానికి స్ట్రెచర్‌కు బదులుగా మినీ బ్యాటరీతో నడిచే కార్లను ఏర్పాటు చేశారు.

ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ మూసా మాట్లాడుతూ, క్యాన్సర్ మరియు ఎముక మజ్జ మార్పిడి అవసరాలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడానికి ఆసుపత్రిని నిర్మించినట్లు తెలిపారు.

''మా వద్ద ఆరు రైడ్ ఆన్ కార్లు ఉన్నాయి. కొన్నిసార్లు పిల్లలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు టోమోగ్రఫీ, MRI స్కాన్ల కోసం పంపుతాము. ట్రీట్‌మెంట్‌కి వెళ్లడం ఇష్టం లేని పిల్లలు ఇప్పుడు రైడ్‌ ఆన్‌ కార్‌ ఎక్కి వెళుతున్నారు'' అని డాక్టర్ తెలిపారు.

Next Story