Vivek Ramaswamy: అమెరికా ఎన్నికల రేసులో మనవాడి జోరు

Vivek Ramaswamy: అమెరికా ఎన్నికల రేసులో మనవాడి జోరు
ఒక్క గంటలో రూ. 3.7 కోట్ల విరాళాల సేకరణ

అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఎన్నికలకు ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్న విషయాన్ని తేల్చేందుకు అమెరికాలోని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు తమ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. తాజాగా, వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ నుంచి ఆశావాహ అధ్యక్షుల డిబేట్లో పాల్గొన్నారు. అద్భుతంగా మాట్లాడి అందరి దృష్టినీ ఆకర్షించారు. దీంతో భారత సంతతి పారిశ్రామికవేత్త, రిపబ్లికన్ పార్టీ ఆశావాహ అభ్యర్థి వివేక్ రామస్వామి పాపులారిటీ రేటింగ్, ఆన్‌లైన్ ఫండ్లు గురువారం ఒక్కసారిగా పెరిగాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్న ఆయన.. భారత సంతతికి చెందిన మరో నేత నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్, మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ వంటి దిగ్గజ నేతలకు గట్టిపోటీ ఇస్తున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వంపై నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి మధ్య తాజాగా జరిగిన చర్చలో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఈ సారి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహా మొత్తం ఎనిమిది మంది పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచారు.


చర్చ తరువాత జరిగిన సర్వేలో వివేక్ అభ్యర్థిత్వానికి ఏకంగా 28 శాతం మంది మద్దతిచ్చారు. రాన్ డిశాంటిస్‌కు 27 శాతం మంది మద్దతుగా నిలవగా , మైక్‌పెన్స్‌కు 13 శాతం, నిక్కీ హేలీకి 7 శాతం మంది మద్దతు లభించింది. ఇక అమెరికా వార్త సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్లు వివేక్‌పై ప్రశంసల జల్లు కురిపించాయి. అందరి దృష్టినీ ఆకర్షించడంలో సఫలీకృతమయ్యారన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story